Serial Actress: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఆకర్షణ ఏర్పడడం సహజం. కానీ బుల్లితెర పై నటిస్తున్న యాక్టర్స్ సైతం తమతో నటించిన వారితో ప్రేమలో పడడం కామన్. ఈమధ్య చాలామంది జంటలు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఓకే సీరియల్ లో నటించిన వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమతోనే కొందరు డేటింగ్ చేస్తే.. మరికొందరు మాత్రం పెళ్లి పీటల వరకు తీసుకెళ్తున్నారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లలో నటించిన యాక్టర్స్ కొంతమంది తమ ప్రేమని బయట పెట్టడంతో పాటుగా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ జంటలు ఎవరు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమైన మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ప్రియాంక జైన్. ఈ సీరియల్లో శివకుమార్ ఓ క్యారెక్టర్ లో నటించారు. వీరిద్దరి మధ్య రియల్ లైఫ్ లో కూడా ప్రేమ ఏర్పడింది. గత కొన్నేళ్లుగా వీళ్ళిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఇప్పటివరకు పెళ్లి మాట ఎత్తనే లేదు. వచ్చే ఏడాదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ గుడ్ న్యూస్ ని ఎప్పుడు చెప్తారో చూడాలి..
కార్తీకదీపం సీరియల్ ద్వారా అమూల్య గౌడ. ప్రస్తుతం ఈమె గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తుంది. ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ వంటి సీరియల్ లో హీరోగా నటించిన నిరంజన్ అమూల్య గౌడ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది వీరిద్దరికి పెళ్లి అయిపోయిందని అనుకున్నారు. కానీ ఇంకా పెళ్లి కాలేదు. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త వినిపిస్తుంది.
బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్లో హీరోగా నటించిన మహేష్ సీరియల్ నటి శాండ్రా ఇద్దరు కలిసి సీరియల్స్లలో నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. వారి ప్రేమని ఇన్నాళ్లకు పెళ్లి వరకు తీసుకెళ్లబోతున్నారు.. ఆల్రెడీ వీరిద్దరి పెళ్లి పనులు మొదలైపోయాయి త్వరలోనే మూడు ముళ్ళతో ఒక్కటవ్వబోతున్నారు.
Also Read: ‘బ్రహ్మముడి ‘ అప్పు రియల్ లైఫ్ లో అన్నీ కష్టాలే.. కన్నీళ్లు ఆగవు..!
వీళ్లే కాదు మరి కొంతమంది జంటలు సహజీవనం చేస్తున్నారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన శోభా శెట్టి, యస్వంత్ కూడా ఆ సీరియల్ ద్వారా ప్రేమలో పడ్డారు. ఇటీవలే ఇరుకుటుంబల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి బిజినెస్ చేస్తూ బిజీగా ఉన్నారు. అతి త్వరలోనే వీళ్ళిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇకపోతే బుల్లితెర హీరో నిఖిల్, కావ్య ఇద్దరు కూడా చాలా కాలం పాటు డేటింగ్ చేశారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతారు అంటూ వార్తలు కూడా వినిపించాయి.. ఏమైందో తెలియదు కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏమైనా కలుస్తారేమో చూడాలి..