Brahmamudi Appu : ఒకప్పుడు సీరియల్స్ పెద్దగా జనాలను ఆకట్టుకునేవి కాదు. కానీ ఈ మధ్య వచ్చిన సీరియల్స్ అయితే డిఫరెంట్ స్టోరీలతో పాటుగా నటీనటుల పర్ఫామెన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. దాంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సీరియల్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా ఎన్నో రకాల సీరియల్స్ ని ప్రసారం చేస్తుంది. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో జనాలను అలరిస్తున్నాయి. స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసాద్ అవుతున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. ముగ్గురు అక్క చెల్లెలు ఓకే ఇంటికి కోడలుగా రావడం, ఆ ఇంట్లో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఈ సీరియల్స్ స్టోరీ ఉంటుంది. ఇందులో మూడో కోడలుగా అప్పు నటించింది. అప్పు రియల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. కన్నీళ్లు తెప్పిస్తున్న ఆమె నిజజీవితం గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బ్రహ్మముడి సీరియల్ లో అప్పు గా మెప్పిస్తున్న నైనిషా రాయ్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో దుగ్గిరాల కుటుంబంలోని మూడో కోడలుగా నటిస్తుంది. ఈమె కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. శ్రీమంతుడు, హంస గీతం, భాగ్యరేఖ, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో నైనిషా కీలక రోల్స్ చేసింది. ఈటీవీలో ప్రసారమైన శ్రీమంతుడు సీరియల్ తో నైనిషా కు మంచి పాపులారిటి దక్కింది.. ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నైనిషా ఓ సందర్భంలో సూసైడ్ చేసుకోవాలని అనుకుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ విషయాన్ని తానే స్వయంగా బయట పెట్టడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేని నైనిషా పేరెంట్స్ బంధం తెంచుకున్నారట. కెరీర్ స్టార్టింగ్ లో తిండిలేక ఎన్నో ఇబ్బందులు పడినట్లు నైనిషా గుర్తుచేసుకుంది.. అలాంటి సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను కష్టాలను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది.
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అబ్బాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తారని అంతా అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కానీ అమ్మాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తారని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలిసింది. నా తల్లిదండ్రులు సపోర్టు లేదు. ఒంటరిగా నేను ఎదుర్కొన్న కష్టాల గురించి తలుచుకుంటే ఇప్పుడు కన్నీళ్లు ఆగవు అంటూ ఆమె చెప్పింది. జీవితం లో డబ్బు చాలా ఇంపార్టెంట్ అని ఆమె చెప్పింది. కేరింగ్ గా చూసుకునే వ్యక్తి దొరికితే చాలు అని నైనిషా వెల్లడించింది.. ఇటీవలే తను ప్రేమించిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోల ను ఆమె తన సోషల్ మీడియా లో షేర్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలేక్కబోతున్నారని సమాచారం.. ప్రస్తుతం ఆమె బ్రహ్మముడి, వంటలక్క సీరియల్స్ లో నటిస్తుంది..