BigTV English

Beard Growth: గడ్డం ఒత్తుగా పెరగాలా ? అయితే టిప్స్ ఫాలో అయిపోండి

Beard Growth: గడ్డం ఒత్తుగా పెరగాలా ? అయితే టిప్స్ ఫాలో అయిపోండి

Beard Growth: మందపాటి గడ్డం, మీసాలు కోరుకోని వ్యక్తి ఎవరుంటారు చెప్పండి? ప్రస్తుతం వీటిపై మరింత క్రేజ్ పెరిగింది. పుష్పా- 2 లో అల్లూ అర్జున్ లాంటి గడ్డం తమకు కూడా ఉండాలని నేటి తరం యువకులు కోరుకుంటున్నారు. చాలా మంది యువకులు గడ్డం పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే గడ్డం పురుషత్వానికి చిహ్నం.


గడ్డం పెరుగుదల కోసం వాడే ఆయిల్ గడ్డానికి సరైన షేప్ ఇవ్వడంతో పాటు క్లాసీ లుక్‌ని ఇస్తుంది. మీరు పర్ఫెక్ట్ గడ్డం స్టైల్‌ను మెయింటెయిన్ చేస్తే, అది మీకు బెస్ట్ లుక్‌తో పాటు పర్సనాలిటీలో బూస్ట్ ఇస్తుంది.

మీకు హెయిర్ ఫాల్ లేదా సన్నటి గడ్డం వంటి సమస్యలు ఉన్నట్లయితే, మీ గ్రూమింగ్ లిస్ట్‌లో మంచి గడ్డం పెరగడానికి ఆయిల్ తప్పకుండా ఉంచండి. ఈ నూనె మీకు ఉపయోగపడుతుంది. మార్కెట్లో బియర్డ్ పెరగడానికి ఉపయోగించే అనేక బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా  స్టైల్‌గా కనిపించడం కోసం చాలా మంది రకరకాల ఉత్పత్తులను కూడా వాడుతున్నారు. ముఖ్యంగా దీనికి కారణం టీనేజర్లలో అభద్రతాభావం. బయట మార్కెట్‌లో అధిక రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ వాడే బదులు కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల గడ్డం బాగా పెరుగుంది. మరి ఆ చిట్కాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.


దట్టమైన గడ్డం, మీసాలు కావాలంటే, బియర్డ్ నూనెను ఈ రోజు నుండే మీ గ్రూమింగ్ రొటీన్‌లో భాగంగా చేసుకోండి. దీన్ని ఎలా, ఎప్పుడు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్కెట్లో గడ్డం పెరిగేందుకు వివిధ రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి . కాబట్టి మీరు ఆల్ లైన్‌లో రివ్యూస్ చూసి లేదా మార్కెట్ లో మంచి ఆయిల్ కొని వాడండి. మీ బడ్జెట్‌లో ఏదైనా నూనెను కొని ప్రతి రోజు రాత్రి ఉపయోగించండి.

కొందరికి గడ్డం లుక్ ఇష్టపడ్డప్పటికీ.. దురద వారిని ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారు ఈరోజు నుండే ఈ చిట్కాలను పాటించండి.
– రాత్రి సమయంలో, మీరు మీ అరచేతికి కొంచెం గడ్డం పెరిగేందుకు వాడే నూనెను తీసుకొని మీ గడ్డంపై వృత్తాకారంలో మసాజ్ చేయండి. దీంతో మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే, ఉదయం నిద్రలేచిన తర్వాత తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రం చేసుకోండి. లేకపోతే మీ చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమల సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read: అబ్బాయిలూ.. ముఖం జిడ్డుగా మారుతోందా ? ఓ సారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

గడ్డం పెరగడం కోసం ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:

– మీరు గడ్డానికి నూనెను రాసేటప్పుడు, మీ ముఖం పూర్తిగా శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
– మీ గడ్డం, మీసాలు పెరగడానికి ఇది కేవలం నాలుగైదు చుక్కలు సరిపోతుంది.
– వేళ్ల సహాయంతో గడ్డం, మెడ ప్రాంతంలో మసాజ్ చేయండి.
-ఎక్కువ సేపు మసాజ్ చేయడం కూడా హానికరం.మసాజ్ కోసం కేవలం 5 నిమిషాలు మాత్రమే కేటాయించండి.
– మీ చర్మం సున్నితంగా ఉంటే, గడ్డం నూనెను రాసేటప్పుడు, అందులోని పదార్థాలు మీ చర్మాన్ని ప్రేరేపించకూడదని గుర్తుంచుకోండి. దీన్ని తెలుసుకోవడానికి, నూనెను ఉపయోగించిన మొదటి రోజున ప్యాచ్ టెస్ట్ చేయండి.
– మంచి ఫలితాలను పొందడానికి, మీరు నూనెను అప్లై చేసిన తర్వాత మీ గడ్డాన్ని కూడా దువ్వవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా గడ్డం త్వరగా పెరిగేలా చేస్తుంది.

Related News

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Big Stories

×