BigTV English

Bigg Boss 8 Telugu: ఆ వీడియోలు బయటపెట్టిన నాగార్జున.. సెంటిమెంట్ బ్రేక్ చేసిన తేజ, యష్మీ గురించి ఆడియన్స్ ఫీలింగ్ కూడా అదే

Bigg Boss 8 Telugu: ఆ వీడియోలు బయటపెట్టిన నాగార్జున.. సెంటిమెంట్ బ్రేక్ చేసిన తేజ, యష్మీ గురించి ఆడియన్స్ ఫీలింగ్ కూడా అదే

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో మరొక వీకెండ్ ఎపిసోడ్ ముగిసింది. గతవారంలో పాత, కొత్త కంటెస్టెంట్స్ అంతా కలిసి నాలుగు కొత్త టీమ్స్‌గా ఏర్పడి ఆడిన ఆటల గురించి నాగార్జున రివ్యూలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఆటల్లో చాలావరకు కంటెస్టెంట్స్ నోరుజారారు. కోపంలో అలా జరిగిపోవడం వల్ల వారు నోరుజారిన విషయం కూడా చాలామంది గ్రహించలేదు. అందుకే వీకెండ్ ఎపిసోడ్ మొదలయినప్పటి నుండి కంటెస్టెంట్స్ నోరుజారిన వీడియోలను చూపించి వారికి క్లాస్ తీసుకున్నారు నాగార్జున. అంతే కాకుండా వీకెండ్ ఎపిసోడ్ చూడడానికి వచ్చిన ఆడియన్స్.. యష్మీపై చేసిన కామెంట్స్ విని తనే షాకయ్యింది. ఇక ఫైనల్‌గా తన సెంటిమెంట్‌ను బ్రేక్ చేశాడు టేస్టీ తేజ.


యష్మీ ఏడ్చిందంటే అంతే

వీకెండ్ ఎపిసోడ్ మొదలవ్వగానే ముందుగా స్టూడియోలో ఉన్న ప్రేక్షకుడితో మాట్లాడారు నాగార్జున. తన ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్ అని చెప్పిన వ్యక్తి.. నచ్చని కంటెస్టెంట్ ఎవరు అని యష్మీ పేరు చెప్పారు. ఎందుకంటే కారణం కూడా చెప్పారు. యష్మీ చాలా సులువుగా మాట మారుస్తుందని, తనను ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వెంటనే ఏడ్చి కవర్ చేస్తుందని అన్నారు. యష్మీ ఏడ్చిందంటే అది అబద్ధమని ఫిక్స్ అయిపోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. యష్మీతో నాగార్జున మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా అదే జరిగింది. దీంతో ఆడియన్స్ ఎలా ఫీలవుతున్నారో యష్మీతో చెప్పారు నాగ్. ఏడిస్తే ప్రేక్షకులు అలా అనుకుంటున్నారని, ఏడవద్దని సలహా ఇచ్చారు.


Also Read: బిగ్ బాస్ లో మరో లేడీ కంటెస్టెంట్ బలి.. ఊహించిన వారే ఎలిమినేట్..?

ఇప్పటినుండి మారుతాను

పానిపట్టు యుద్ధం టాస్కులో ప్రేరణ, నిఖిల్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను చూపించారు నాగార్జున. అందులో ప్రేరణ.. నిఖిల్‌ను బూతు తిట్టినట్టుగా ఉంది. దాని గురించి తను ఎంత సర్థిచెప్పుకోవాలని చూసినా వర్కవుట్ అవ్వలేదు. పైగా తను నయనిని పుడింగి అన్న విషయంపై కూడా సీరియస్ అయ్యారు నాగ్. దీంతో వేరే దారిలేక నిఖిల్, నయనికి సారీ చెప్పింది ప్రేరణ. అదే టాస్క్‌లో నిఖిల్ ఆటతీరుపై నాగార్జున సీరియస్ అయ్యారు. ఎప్పుడూ లేనిది కోపంగా ప్రేరణ, యష్మీలపైకి వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. అయితే తన తప్పేంటో తాను తెలుసుకున్నానని ఇప్పటినుండి అలా ఉండడని మాటిచ్చాడు నిఖిల్. అదే టాస్క్ విషయంలో గౌతమ్‌కు కూడా తిట్లు పడ్డాయి.

ఇంతటితో మర్చిపోదాం

గౌతమ్.. నిఖిల్‌కు వినిపించకుండా ఏదో బూతు మాట తిట్టాడని కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్ కూడా ఫీలయ్యారు. దీంతో గౌతమ్.. నిఖిల్‌కు సారీ చెప్పాడు. నిఖిల్ కూడా ఈ విషయం ఇంతటితోనే మర్చిపోదామని మాటిచ్చాడు. యెల్లో టీమ్‌లోని పృథ్వి, రోహిని, నయని పావని ఆటతీరును మెచ్చుకున్నారు నాగ్. హరితేజ, టేస్టీ తేజ కూడా బాగా ఆడారని అన్నారు. మెగా చీఫ్‌గా విష్ణుప్రియా సక్సెస్ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎపిసోడ్ ముగిసే సమయానికి నామినేషన్స్ నుండి టేస్టీ తేజ సేవ్ అయ్యాడు. గత సీజన్‌లో తాను 9వ వారంలోనే ఎలిమినేట్ అయ్యానని, ఈసారి కూడా అదే సెంటిమెంట్‌తో భయపడుతూ ఉన్నానని అన్నాడు. ఫైనల్‌గా సేఫ్ అయినందుకు హ్యాపీగా ఫీలయ్యాడు.

Related News

Bigg Boss9 Promo: ఉత్కంఠ రేకెత్తిస్తున్న కెప్టెన్సీ టాస్క్.. వర్షంలో హీట్ పుట్టిస్తూ!

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Big Stories

×