Madharaasi OTT: ప్రముఖ కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మదరాసి (Madharaasi) . డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ (ఆ.R.Muragadas)దర్శకత్వంలో ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదివరకు శివ కార్తికేయన్ నటించిన అమరన్ సినిమా తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. శివ కార్తికేయన్ ,రుక్మిణి వసంత్(Rukmini Vasanth) జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో మురుగదాస్ కం బ్యాక్ ఇస్తారని అందరూ భావించారు కానీ ఎప్పటిలాగే మురగదాస్ తన సినిమాతో మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచారు.
మదరాసి యాక్షన్ థ్రిలర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఇందులో యాక్షన్ సన్ని వేషాలు విజువల్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇలా థియేటర్లో ప్రేక్షకు ఆదరణకు నోచుకోని ఈ సినిమా నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్ధ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)వారు ఏకంగా 60 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి కావడంతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు.
ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్టోబర్ 1 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులోకి రానున్నట్లు తెలియజేశారు. మరి థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీ అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Brace yourself for a mad ride with yours truly Madharaasi ❤️🔫#MadharaasiOnPrime, Oct 1@SriLakshmiMovie @Siva_Kartikeyan @ARMurugadoss @anirudhofficial @VidyutJammwal #BijuMenon @rukminitweets @actorshabeer @vikranth_offl @SudeepElamon pic.twitter.com/McLGlMBEN4
— prime video IN (@PrimeVideoIN) September 26, 2025
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే తమిళనాడులో పెద్ద సిండికేట్ నడుస్తుంది. అక్కడ వారికి తుపాకీ సంస్కృతిని అలవాటు చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఇందులో విరాట్, చిరాగ్ అనే ఇద్దరు స్నేహితులు పెద్ద ఎత్తున ఆయుధాలను తరలిస్తూ ఉంటారు. ఈ ఆయుధాలని ఒక ఫ్యాక్టరీకి తరలిస్తుంటారనే విషయం ఎన్ఐఏ సంస్థకు తెలుస్తుంది.ఎన్ఐఏ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రేమ్ నాథ్ (బీజు మేనన్) ఆయుధాలు ఉన్న ఫ్యాక్టరీని పేల్చేయాలని పథకం రచిస్తారు. అదే సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్న రఘురాం (శివ కార్తికేయన్) ను ప్రేమ్ నాథ్ కలుస్తారు. ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రఘురాంను ఈ ఆపరేషన్ లో ప్రేమ్ నాథ్ భాగం చేస్తారు. అసలు రఘు రాం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? ఈ ఆపరేషన్ లో పాల్గొనడానికి రఘురాం ఒప్పుకుంటాడా? ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయ్యిందా? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.