Sujeeth: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వినపడుతున్న దర్శకుల పేర్లలో సుజీత్ (Sujeeth) పేరు ఒకటి. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రన్ రాజా రన్ సినిమా ద్వారా దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుజీత్ ఈ సినిమాకు సైమా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నారు. ప్రభాస్ హీరోగా సాహో సినిమా(Sahoo) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రభాస్ నటించిన సాహో సినిమా దక్షిణాది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఉత్తరాది రాష్ట్రాలలో ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ లభించింది.. ఇక ఈ సినిమా తర్వాత సుజిత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఓజి సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సుజిత్ తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. నిజానికి పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా(OG Movie) కంటే ముందుగా తనకు బాలీవుడ్ ఆఫర్ (Bollywood Offer)వచ్చిందని ఈయన వెల్లడించారు.
ప్రభాస్ సాహో సినిమా నార్త్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న నేపథ్యంలో ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు వచ్చాయని అయితే అదే సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈయనకు అవకాశం కల్పించడంతో సుజీత్ సందిగ్ధంలో పడ్డారని వెల్లడించారు. బాలీవుడ్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సినిమా చేయాలనుకోవడం రెండు పడవలపై ప్రయాణం చేసినట్టేనని, అది ఎప్పటికైనా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కోసం బాలీవుడ్ సినిమా ఆఫర్ ని వదులుకున్నానని వెల్లడించారు.
సుజీత్ సినిమాటిక్ యూనివర్స్..
ఇలా పవన్ కళ్యాణ్ కోసం బాలీవుడ్ ఆఫర్ వదులుకున్నానని చెప్పిన సుజిత్ ఏ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ కోసం సుజీత్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? బాలీవుడ్ అవకాశాన్ని వదులుకొని తప్పు చేశారా? అంటూ ఎన్నో రకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఓజీ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని వెల్లడించారు. అలాగే ఈయన సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తూ ఏ ఏ హీరోలను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Also Read: Madharaasi OTT: మదరాసి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది… ఎప్పుడంటే?