BigTV English

Bigg Boss 9 Promo: కట్టగట్టుకొని మరీ ఆమెను పంపించేశారుగా.. ఇది మిడ్ వీక్ ఎలిమినేషనా?

Bigg Boss 9 Promo: కట్టగట్టుకొని మరీ ఆమెను పంపించేశారుగా.. ఇది మిడ్ వీక్ ఎలిమినేషనా?

Bigg Boss 9 Promo: “ఇది చదరంగం కాదు రణరంగం” అంటూ ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 ప్రకటించారో అప్పుడే హోస్ట్ నాగార్జున(Nagarjuna ) ఈ విషయాన్ని అందరికీ తెలియజేసిన విషయం తెలిసిందే. కనీవిని ఎరుగని రీతిలో టాస్కులు ఉంటాయని.. ప్రేక్షకుడు కూడా ఊహించని ట్విస్టులు ఈ సీజన్లో చూడబోతున్నారు అంటూ భారీ హైప్ పెంచేశారు నాగార్జున. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా దానినే తలపిస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా కనీసం ఊహకు కూడా అందని విధంగా ట్విస్ట్ లు ఉండడం అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.


మిడ్ వీక్ ఎలిమినేషన్..?

ఈ మేరకు తాజాగా 19వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో హౌస్ సభ్యులందరూ కట్టగట్టుకొని మరీ సంజనను హౌస్ నుంచి పంపించేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఇది మిడ్ వీక్ ఎలిమినేషనా? కనీసం ఎటువంటి హింట్ ఇవ్వలేదే ? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఇది కదా అసలు ట్విస్ట్ అంటూ ఇలా ఎవరికి వారు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

అందరికీ ఆమె టార్గెట్?

తాజాగా విడుదలైన ప్రోమో విషయానికి వస్తే.. ఇంటి సభ్యులందరూ ఇప్పటివరకు మీకు లభించిన ఫలాలలో.. నీలం, నలుపు రంగు సీడ్స్ ఏమి తీసుకొచ్చాయో చూసారు. ఇప్పుడు రెడ్ సీడ్ పొందిన వారి వంతు. రెడ్ సీడ్ పొందిన వారికి ఇంటి నుంచి ఒకరిని బయటకి పంపే అధికారాన్ని బిగ్ బాస్ మీకు కల్పిస్తున్నారు అంటూ చెబుతారు. దీంతో ఎవరికైతే రెడ్ సీడ్ లభించిందో వారంతా ఒకచోట చేరి ఎవరిని ఇంటి నుంచి పంపించాలని డిస్కషన్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే హరిత హరీష్ మాట్లాడుతూ..” నాకైతే సంజన గారు.. ఆమెను హౌస్ నుంచి పంపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ షో దొంగతనాల సీజన్ అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు” అంటూ తెలిపాడు. ఇక ఆ తర్వాత కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఆమెకు ఏదైనా చెబితే పర్సనల్గా వెళ్తారు. అది నాకు నచ్చడం లేదు” అని చెబుతాడు. ఇక తర్వాత రాము రాథోడ్ మాట్లాడుతూ.. “ఎవరికైతే ఆమె ఫేవర్ గా ఉంటారో.. వాళ్ళ సైడే మాట్లాడుతారు. వాళ్లకోసమే పనిచేస్తారు”. అంటూ చెబుతారు. భరణి శంకర్ మాట్లాడుతూ..”2 ఆప్షన్లు పెట్టుకొని ఇంకొకరిని ఎవరు చెబుతారు అంటే..?” అందరూ కూడా సంజన పేరే చెప్పడం ఇక్కడ హైలెట్గా మారింది.


పాపం సంజనా..

ఇక తర్వాత అందరూ తీసుకున్న నిర్ణయానికి సంజన గర్లానిని హౌస్ నుంచి పంపించేస్తారు. మొదట ఈ పేరు చెప్పగానే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు అయినా సంజన మాట్లాడుతూ కావాలని నన్ను టార్గెట్ చేసి హౌస్ నుంచి పంపిస్తున్నారు అంటూ చెబుతుంది.బిగ్ బాస్ కూడా మీరు హౌస్ నుండి బయటకు వచ్చేయండి అని చెప్పడంతో ఇమ్మానుయేల్ ఒక్కసారిగా ఏడ్చేస్తారు. ఎప్పుడూ అందర్నీ నవ్వించే ఇమ్మానుయేల్ ఇలా కంటతడి పెట్టుకోవడం చూసే ఆడియన్స్ లో కూడా కన్నీళ్లు తెప్పించింది.

also read:Aamir Khan: నడిరోడ్డుపై అమీర్ ఖాన్ ప్రేయసి అసహనం.. ప్రైవసీ కావాలంటూ?

Related News

Bigg Boss9 Promo: ఉత్కంఠ రేకెత్తిస్తున్న కెప్టెన్సీ టాస్క్.. వర్షంలో హీట్ పుట్టిస్తూ!

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Big Stories

×