Oil For Thick Hair: ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు హెయిర్ ఫాలో తగ్గించుకోవడానికి రకరకాల హెయిర్ ఆయిల్స్‌తో పాటు షాంపూలను కూడా వాడుతుంటారు. అయనప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. మార్కెట్‌లో రసాయన పదార్థాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ వాడటం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. అంతే కాకుండా కొన్ని సార్లు సమస్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే హోం రెమెడీస్ వాడటం అలవాటు చేసుకోవాలి.
ముఖ్యంగా ఇంట్లోనే తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్స్ వాడటం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హోం మేడ్ హెయిర్ ఆయిల్స్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్ ఆయిల్ తయారీ:
కావాల్సినవి:
కొబ్బరి నూనె- 1/2 కప్పు
బాదం నూనె- 1/4 కప్పు
శీకాకాయ్ పౌడర్- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా ఒక మందపాటి ప్యాన్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. 5 నిమిషాల తర్వాత బాదం నూనె వేసి కాసేపు మరిగించాలి. తర్వాత శీకాకాయ్ పౌడర్ వేసి వేడయ్యాక చివర్లో నిమ్మరసం వేసి గ్యాస్ ఆఫ్ చేసి చర్లార్చాలి. తర్వాత ఆయిల్ వడ కట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.
ఈ నూనె యొక్క ప్రయోజనాలు:
పొడవాటి, ఆరోగ్యకరమైన జుట్టు: ఈ నూనెను తలకు క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది.
బలమైన, మెరిసే జుట్టు: ఈ నూనె మీ జుట్టును బలంగా, మెరిసేలా చేయడానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
చుండ్రు , దురద నివారణ: ఈ ఆయిల్ వాడటం వల్ల చుండ్రు, దురద సమస్య నుండి బయటపడవచ్చు.
మృదువైన జుట్టు: ఈ నూనె మీ జుట్టును మృదువుగా మారుస్తుంది. అంతే కాకుండా జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది.
అలోవెరా ఆయిల్ :
అర కప్పు అలోవెరా జెల్‌లో సమాన పరిమాణంలో కొబ్బరి నూనె కలపండి. దీన్ని 5 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. అది చల్లబడిన తర్వాత, దానికి కొన్ని చుక్కల రోజ్మేరీ ఆయిల్ వేసి కలపండి. ఈ నూనెను ప్రతిరోజూ మీ జుట్టుకు రాయండి. కలబందలో 20 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టును బలపరుస్తాయి.
Also Read: దాల్చిన చెక్క పౌడర్‌తో షుగర్ కంట్రోల్, కొలెస్ట్రాల్‌కు చెక్ !
మందార నూనె:
3 మందార పూల రేకులను తీసుకుని ఎండలో బాగా ఆరబెట్టండి. దీన్ని గ్రైండ్ చేసి, దానికి కొబ్బరి , బాదం నూనె తగిన మోతాదులో కలపండి. తర్వాత దీనిని 10 నిమిషాల పాటు మరిగించి ఆపై వడకట్టి గబ్బాలో స్టోర్ చేసుకోండి.
మందారలో అమైనో ఆమ్లాలు, విటమిన్ బి , విటమిన్ సి ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
ఉసిరి నూనె:
ఉసిరి నూనెను హెయిర్ టానిక్ అని కూడా అంటారు. వీటితో ఆయిల్ తయారు చేయడానికి 4 ఉసిరి కాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కోయండి. తర్వాత ఒక పాన్ తీసుకుని, అందులో తగిన మోతాదులో కొబ్బరి నూనె, నువ్వుల నూనె, జామకాయ ముక్కలు వేసి తక్కువ మంట మీద కొద్ది సేపు ఉడికించాలి. వడ కట్టుకొని డబ్బాలో స్టోర్ చేయాలి. అంతే ఆయిల్ సిద్ధంగా ఉంది.