Today Gold Rate: బంగారం ధరల్లో నిత్యం మార్పులు చేర్పులు చేసుకుంటాయి. ఒకరోజు ఉన్న ధర మరొక రోజు ఉండదు. గత కొద్ది రోజుల క్రితం భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు (మార్చి1st)న బంగారం ధరలు కాస్త తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర 87 వేల 700 రూపాయలు ఉండగా.. ఇవాళ 400 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 87 వేల 300కు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. శుక్రవారం కిలో వెండి ధర 96 వేల 300 ఉండగా.. నేడు 200 తగ్గి.. కిలో వెండి ధర 96 వేల 100కు చేరుకుంది. బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి ఇది శుభతరుణం అని గోల్డ్ మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఒక్క రోజులోనే పది లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఎస్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మామే ఇందుకు కారణం. చైనాపై అమెరికా పది శాతం టారిఫ్ విధించడంతో ఆ ఎఫెక్ట్ మన మార్కెట్లపై పడింది. అంతేకాదు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా ఇన్వెస్టర్లలో నెగిటివ్ సెంటిమెంట్ కు కారణమవుతోంది. శుక్రవారం నాడు భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు మరింత కిందకు దిగజారాయి.
వాస్తవంగా ఇలాంటి నష్టాలు చవిచూడటం ఇది ఐదోసారి అని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు. ఐటీ రంగం 4 శాతం, ఆటోమొబైల్ రంగం 3.7, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 3.2 శాతం కిందకు పడిపోయాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ 2.5 శాతం నష్టపోయాయి. ఇదే టైంలో స్టాక్స్ ను అమ్మడంలో కీలకంగా వ్యవహరించాలని ఎనలిస్టులు చెబుతున్నారు. అమ్మకుండా మరింత క్లోజ్‌గా మార్కెట్‌ను గమనించాలని సూచిస్తున్నారు.
నిన్నటి ముగింపుతో పోల్చుకుంటే ఇవాళ ఉదయం 400 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతగా నష్టాల్లోకి కూరుకుపోయింది. ఏ దశలోనూ లాభాల్లోకి రాలేదు. మధ్యాహ్నం తర్వాత నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. చివరకు సెన్సెక్స్ 1414 పాయింట్ల భారీ నష్టంతో 73, 198 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఏకంగా 420 పాయింట్ల భారీ నష్టంతో 22, 124 వద్ద స్థిరపడింది. ఈ తరుణంలోనే బంగారం ధరలు తగ్గడానికి కారణం అని నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరలు ఇలా..
ఢిల్లీలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,550కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 770 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 పలుకుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86, 620 కి చేరుకుంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620పలుకుతోంది.
కేరళ, కోల్‌కత్తాలో22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 పలుకుతోంది.
Also Read: ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లు ఫైనల్.. మీకు కలిగే ప్రయోజనాలేంటి?
వెండి ధరలు పరిశీలిస్తే..
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు హైదరబాద్, వైజాగ్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.1,05,000కి చేరుకుంది.
బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.97,000 వద్ద కొనసాగుతోంది.