Kannappa Teaser 2 Review :మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్టేజియస్ సినిమాగా రాబోతున్న చిత్రం కన్నప్ప (Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదలయ్యింది. ముఖ్యంగా విష్ణు నటన, మ్యూజిక్, ఇతర నటుల సన్నివేశాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. కానీ చివర్లో రెండుసార్లు కనిపించినా ప్రభాస్ లుక్ మాత్రమే హైలెట్గా నిలిచింది. అటు వీఎఫ్ఎక్స్ కూడా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. ఇందులో ప్రభాస్ లుక్ తప్ప మిగతా అంతా పేలవంగా అనిపిస్తోంది. అటు మంచు విష్ణు నటన కూడా సో సో గానే వుంది. మొత్తానికి ఈ టీజర్ కి వీఎఫ్ఎక్స్ పెద్ద మైనస్ గా మారిందని తెలుస్తోంది.
టీజర్ 2 కూడా అంతే…
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన “శివ శివ శంకర” అనే పాటకు కూడా నెగిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మంచు విష్ణు తో పాటు మంచు మోహన్ బాబు(Manchu Mohan babu), ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు మంచు విష్ణు కూతుళ్లు అరియానా , వివియానా కూడా ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఇంత పెద్ద తారాగణం నటిస్తున్నప్పటికీ, వీరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు రెండవసారి టీజర్ విడుదల చేసినా.. ఇది కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోగా ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. మరి ఇంత నెగెటివిటీ మధ్య ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి ఇది.
మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీ.. ట్రోలర్స్ కి మంచి స్టఫ్..
వాస్తవానికి మంచు విష్ణు గత కొన్ని సంవత్సరాలుగా తన ప్రెస్టేజియస్ మూవీ అయిన కన్నప్ప కోసమే సమయాన్ని కేటాయించారు. ఎన్ని పనులు వున్నా.. అన్నింటిని పక్కన పెట్టి, కన్నప్ప కోసమే పనిచేస్తున్నారు. పైగా ప్రతి భాషా ఇండస్ట్రీకి సంబంధించిన భారీ తారాగణంను ఈ సినిమాలో జత చేయడం జరిగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. సినిమా నుంచి విడుదల చేస్తున్న పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదని చెప్పవచ్చు. మొదట స్టార్ కాస్ట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రివీల్ చేశారు. ఇవన్నీ కూడా ప్రేక్షకులలో నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ తర్వాత టీజర్ 1 విడుదల చేయగా.. అది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో హోప్స్ పెట్టుకున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చింది. ఇప్పుడు టీజర్ 2 కూడా అదే పరిస్థితి. మరోవైపు మోహన్ బాబు పాత్ర ఇందులో కాస్త గంభీరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ నిరాశపరిచినా.. ఈ టీజర్ 2 లో మాత్రం ప్రభాస్ లుక్ కాస్త పరవాలేదు అనిపిస్తోంది. ఓవరాల్ గా ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ లో ఒక ప్రభాస్ చూపు తప్ప మిగతా వన్నీ కూడా సినిమాపై విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే ట్రోలర్స్ కి మంచి స్టఫ్ లభిస్తోందని చెప్పవచ్చు.