Cinnamon Powder: దాల్చిన చెక్క దాదాపు ప్రతి ఒక్కరు వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది ఆహారం యొక్క రుచిని పెంచడమే కాకుండా, అద్భుతమైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది.
పురాతన కాలం నుండి ఆయుర్వేద చికిత్సలలో కూడా దాల్చిన చెక్కను ఉపయోగిస్తున్నారు. నేటికీ ఇది వివిధ వ్యాధుల చికిత్సలో ఉపయోగకరంగా ఉందని నిరూపించబడింది. దాల్చిన చెక్క పౌడర్ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది శరీర ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
దాల్చిన చెక్క పొడి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. దీంతో పాటు, బరువు తగ్గడానికి, ఇన్ఫెక్షన్ల నివారణకు, చర్మ ఆరోగ్యానికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
దాల్చిన చెక్క పొడి యొక్క ప్రయోజనాలు:
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:
దాల్చిన చెక్క పొడి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణం , ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవడం వల్ల పేగుల్లో మంట తగ్గుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఇది కడుపులో ఉండే బ్యాక్టీరియాను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా కడుపును శుభ్రంగా కూడా ఉంచుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది:
దాల్చిన చెక్క పొడి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ పని తీరును పెంచుతుంది. అంతే కాకుండా ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనంగా ఉంటుంది. దాల్చిన చెక్క తరచుగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరీకరించబడతాయి. ఫలితంగా మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు:
దాల్చిన చెక్క పొడిలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా, దాల్చిన చెక్క చర్మానికి కూడా మేలు చేస్తుంది, ఎందుకంటే ఇది చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
దాల్చిన చెక్క పొడి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్త నాళాలలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుంది. తద్వారా రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. అంతే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇన్ఫెక్షన్ల నివారణ:
దాల్చిన చెక్క పొడిలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్లు , జలుబు , దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది శరీరం వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
Also Read: గుమ్మడి విత్తనాలతో.. మతిపోయే లాభాలు !
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
దాల్చిన చెక్క పొడి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో కొవ్వును కాల్చే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది అతిగా తినే సమస్యను తగ్గిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర కొవ్వు స్థాయి తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.