Onion for Hair Care: ఉల్లి చేసిన మేలు తల్లి చేయదని పెద్దలు చెబుతుంటారు. మరి నిజంగా శరీరం లోపల.. ఆరోగ్యానికి ఉల్లి మేలు చేస్తుందో లేదో తెలీదు కానీ.. జుట్టుకు మాత్రం భలే ఉపయోగపడుతుందట. ఈ మధ్య అందరికీ జుట్టు ఊడిపోవడం ఎక్కువైంది. జుట్టు పల్చపడటం, నిర్జీవంగా మారడం, కుదుళ్లు బలహీనంగా అయిపోవడం.. దువ్వుకున్నప్పుడు, తలస్నానం చేస్తున్నప్పుడు విపరీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. మరి జుట్టు బలంగా, ఊడకుండా, హెల్గీగా ఉండాలంటే ఉల్లిపాయతో వీటిని కలిపి జుట్టుకు పెట్టుకున్నారంటే.. రాలడాన్ని తగ్గించి విపరీతంగా పెరిగేలా సహాయపడుతుంది. ఉల్లిపాయలో అమ్మోనియం, సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లలో ఉండే కెరాటిన్‌ను.. బాగా పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఉల్లిపాయ తలలో వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుందట. మరి ఇన్ని లాభాలు ఉన్న ఉల్లిపాయతో.. హెయిర్ మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ, కలబంద, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్
ఉల్లిపాయ, కలబందను చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీజార్‌లోకి తీసుకుని.. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ మిశ్రమంలో టీ స్పూన్ కొబ్బరి నూనె కలిపి జుట్టుకు పెట్టుకుని, అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ వ్యవస్థ బాగా పెరగడానికి, పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు చక్కగా పనిచేస్తుంది.
ఉల్లిపాయ, కరివేపాకు, నిమ్మరసం హెయిర్ మాస్క్
ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని.. రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు మర్దన చేసి.. అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.. మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఊడిన చోటే జుట్టు పెరిగేందుకు, ఒత్తుగా పెరిగేందురు అద్భుతంగా పనిచేస్తుంది.
ఉల్లిపాయ, పెరుగు, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్
చిన్న గిన్నె తీసుకుని రెండు టేబుల్ స్పూన్ పెరుగు, మూడు టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె రెండు టేబుల్ స్పూన్ కలిపి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. జుట్టు విపరీతంగా పెరుగుతుంది. మీరు ఓసారి ఇలా ట్రై చేయండి.
ఉల్లిపాయ, మెంతులు, పెరుగు హయిర్ మాస్క్
ముందుగా మెంతులను రెండు గంటల సేపు నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీజార్‌లో ఉల్లిపాయ ముక్కలు, మెంతులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. వీటిని చిన్న గిన్నెలోకి తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పెట్టుకుని అరగంట తర్వత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు మూడు సార్లు చేస్తే.. అద్భుతమైన రిజల్ట్ మీకు కనిపిస్తాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే చుండ్రు సమస్యలు దూరం చేస్తుంది.
Also Read: కరివేపాకుతో ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి.. పొడవాటి జుట్టు మీ సొంతం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.