Curry Leaves Hair Oil: ప్రస్తుత రోజుల్లో ప్రధానంగా ప్రతి ఒక్కరు.. ఎదుర్కొంటున్న సమస్య జుట్టురాలిపోవడం. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇక జుట్టురాలడాన్ని ఆపేందుకు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. మార్కెట్లో వివిధ రకాల హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. ఇవి కెమికల్స్ తయారు చేసి ఉంటాయి కాబట్టి.. జుట్టుకు హాని కలిగించే ప్రమాదం ఉంది. జుట్టు కుదుళ్లను బలహీన పరుస్తాయి. జుట్టు నిర్జీవంగా మారే అవకాశం ఉంది. తద్వారా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. సాధారణంగా మహిళలకు అందం పొడవాటి జుట్టు. కానీ బిజీ లైఫ్ స్టైల్, దుమ్మూ, కాలుష్యం వల్ల జుట్టుమీద ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా.. జుట్టు పొడవుగా పెరగాలంటే.. కరివేపాకుతో ఈ హెయిర్ ఆయిల్ ట్రే చేయిండి. మీ జుట్టు పెరగడాన్ని ఆపడం ఎవరితరం కాదు. మరి ఆలస్యం చేయకుండా.. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
కరివేపాకు
మెంతులు
కొబ్బరి నూనె
కలబంద
మందారం ఆకులు
హెయిర్ ఆయిల్ తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని, అందులో మెంతులు, కరివేపాకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకావాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీజార్‌లోకి తీసుకుని మెత్తగా పొడిచేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కావాల్సినంత కొబ్బరి నూనె, మందారం ఆకులు, కలబంద,తయారు చేసుకున్న పొడి వేసి.. 20 నిమిషాల పాటు మరిగించండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి తయారు చేసుకున్న ఆయిల్‌ను గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. కొద్దిరోజులపాటు నిల్వ ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్‌ను ప్రతిరోజు జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవచ్చు. లేదా రాత్రి పడుకునే ముందు పెట్టుకుని.. మరుసటి రోజు సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా క్రమం తప్పకుండా పాటిస్తే.. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. సిల్కీగా మారుతుంది. నల్లగా కూడా ఉంటుంది.
జుట్టు పొడవుగా పెరిగేందుకు ఈ టిప్స్‌ను కూడా పాటించండి. . అద్భుతమైన రిజల్ట్ మీకు కనపిస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్ హెయిల్‌కు కావాల్సిన పదార్దాలు
ఉల్లిపాయ
ఉసిరి పొడి
తులసి ఆకులు
మెంతి పొడి
తయారు చేసుకునే విధానం
ముందుగా పెద్ద బౌల్ తీసుకుని.. అందులో ఐదు టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం, రెండు టేబుల్ స్పూన్ ఉసిరిపొడి, తులసి ఆకుల రసం మూడు టేబుల్ స్పూన్, మెంతి పొడి మూడు టేబుల్ స్పూన్ కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు, మూడు సార్లు చేస్తే.. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. తెల్ల జుట్టు సమస్యలు కూడా తొలగిపోతాయి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రే చేయండి.
Also Read: ఈ సహజసిద్ధ ప్రకృతి చిట్కాతో.. మెరిసే చర్మం మీ సొంతం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.