Karan Johar: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో దృష్టి పెడుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన చికిత్స చేయించుకోవడానికి అనుగుణంగా ఇప్పుడే ఆరోగ్య భీమా(Health Insurance) చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య భీమా తీసుకోవడం వల్ల ప్రాణాంతకర వ్యాధులకు కూడా చికిత్స చేయించుకొని క్షేమంగా బయటపడవచ్చు.. ఇకపోతే ఇటీవల కాలంలో కొంతమంది సెలబ్రిటీలు తమ శరీరంలోని వివిధ భాగాలకు కూడా భీమా చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి భీమా చేయించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఫేస్ ఇన్స్యూరెన్స్…
సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటులకు వారి అందం ఎంతో ముఖ్యం. వారు అందంగా ఉంటేనే సినిమాలలో కూడా అవకాశాలు రావడం తద్వారా ఇండస్ట్రీలో మరికొన్ని రోజుల పాటు కొనసాగడానికి వీలుగా వారి ఆరోగ్య విషయంలోనూ చర్మ సౌందర్య విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది నటీనటులు హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా శరీరంలోని కొన్ని భాగాలకు కూడా భీమా చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar)సైతం ఈ విధమైనటువంటి భీమా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈయన తన ముఖానికి భీమా(Face Insurance) చేయించుకున్నట్లు సమాచారం.
దక్షిణ కొరియా…
కరణ్ జోహార్ బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో కొనసాగే వారికి ముఖ సౌందర్యం కూడా ఎంతో కీలకం. ఏదైనా సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదాలకు గురి అయిన వారి మొహంపై తగిలే గాయాలకు చికిత్స చేయించుకోవాలన్నా, లేదా సర్జరీలు చేయించుకోవాలన్న అధిక ఖర్చులు అవుతుంటాయి. ఇలా ఈ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని కరణ్ జోహార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అయితే దక్షిణాది ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడి సలహాలు సూచనలు మేరకే కరణ్ జోహార్ కూడా ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో కారం జోహార్ తన మొహానికి ఇన్సూరెన్స్ చేయించుకోవడం కోసం తరచూ దక్షిణ కొరియా వెళ్లి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు బయటకు వచ్చాయి. ఈయన దక్షిణ కొరియాలోనే ఈ విధమైనటువంటి ఫేస్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారని సమాచారం. ఇలా ఇతని ఫేస్ ఇన్సూరెన్స్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం పట్ల కరణ్ జోహార్ ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. అయితే గతంలో అమితాబ్ బచ్చన్ తన గొంతుకు భీమా చేయించుకున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కొంతమంది సింగర్లు కూడా ఇలా తమ గొంతు బీమా చేయించుకోవడం, అలాగే క్రీడారంగంలో ఉన్నవాళ్లు తమ కాళ్లు చేతులకు భీమా చేయించుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే భవిష్యత్తులో తన సినీ కెరియర్ గురించి ఆలోచించిన కరణ్ జోహార్ దక్షిణ కొరియాలో ఫేస్ భీమా చేయించుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి అయితే ఈ వార్తలపై అధికారక ప్రకటన వెలవడాల్సి ఉంది. ఇక ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… ఈ వయసులో ఫేస్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, నువ్వేమైనా హీరో అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.