Papaya Face Pack: బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో.. చర్మ సౌందర్యానికి కూడా అంతే మంచిది. మనం ఎన్ని రకాల క్రీమ్స్ వాడినా.. ముఖంపై మృత కణాలు, మలినాలు అనేవి ఉంటానే ఉంటాయి. వాటివల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. తద్వారా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్ది చర్మంపై ముడతలు రావడం కామన్.. ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టేందుకు.. బొప్పాయి సూపర్ ఇంగ్రీడియంట్‌గా పనిచేస్తుంది. కాబట్టి బొప్పాయితో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. బొప్పాయి ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి, పాలు, తేనె ఫేస్ ప్యాక్
బొప్పాయి ముక్కలను మెత్తగా చేసి.. పేస్ట్ లాగా సిద్దం చేసుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ పాలు, తేనె కలిపి ముఖానికి పెట్టుకుని, 15-20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. చర్మం తాజాగా మెరుస్తుంది కూడా.
బొప్పాయి, నిమ్మరసం ఫేస్ ప్యాక్
బొప్పాయి గుజ్జులో, రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. అలాగే ట్యాన్‌ను తగ్గించి, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.
శెనగపిండి, బొప్పాయి, ఫేస్ ప్యాక్
బొప్పాయి గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ శెనగపిండి కలిపి.. ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడంతో పాటు, ముఖం ఫ్రెష్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
బొప్పాయి, పసుపు ఫేస్ ప్యాక్
చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి.. బాక్టీరియాతో పోరాడే బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇది. బొప్పాయి గుజ్జులో చిటికెడు పసుపు కలిపి.. ముఖానికి పెట్టుకోండి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
బొప్పాయి, టమాటా ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో బొప్పాయి గుజ్జు, టమాటా రసం కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా చేసి, రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. మృత కణాలను తొలగిస్తుంది.
బొప్పాయి, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్
చిన్నబౌల్ తీసుకుని అందులో బొప్పాయి గుజ్జు, మిల్తానీ మిట్టి కలిపి ముఖానికి పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అదనపు నూనెలను తొలగిస్తుంది. అలాగే మచ్చలను, పిగ్మెమెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: ఈ టిప్స్ ఫాలో అవ్వండి..! చిటికెలో మీ ఫేస్ అందంగా మారిపోతుంది..
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.