BigTV English

Tips For Skin Glow: ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..! చిటికెలో మీ ఫేస్ అందంగా మారిపోతుంది..

Tips For Skin Glow:  ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..! చిటికెలో మీ ఫేస్ అందంగా మారిపోతుంది..

Tips For Skin Glow: ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని.. అలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. మనలో చాలామంది తెల్లగా కావాలని కోరుకుంటారు. ఎన్ని ఫేస్ క్రీమ్స్ వాడినా సరే.. ఏ ప్రయోజనం ఉండదు. అలాంటివారు ఈ నాచురల్ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వారంటే.. మీ అందానికి తిరిగే ఉండదు. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ముఖం కాంతివంతంగా ఉండాలంటే..
ముందుగా రోజ్ వాటర్‌ను.. ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకోవాలి. వీటిని ముఖంపై ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇలా చేయడం ద్వారా ముఖం కాంతివంతంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

డార్క్ సర్కిల్స్ కోసం
గ్రీన్‌‌టీలను ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకుని.. వీటిని ముఖంపై 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇలా ప్రతిరోజు చేస్తే.. కంటిచుట్టూ నల్లటి వలయాలు తొలగిపోతాయి. ఫేస్ కూడా కాంతివంతంగా మెరుస్తుంది.


డై స్కిన్ కోసం
కీరదోస రసాన్ని ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకుని.. ముఖంపై ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోయి కాంతివంతంగా మెరిసేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

మొటిమలు, మచ్చలు తొలగిపోవాలంటే..
అలోవెరాజెల్‌ను కొంచెంసేపు ఫ్రిజ్‌లో ఉంచి.. ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకోవాలి. వీటిని ప్రతిరోజు ముఖంపై ఉదయం, సాయంత్రం మసాజ్ చేస్తే మొటిమలు, మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు కూడా.

అందమైన ముఖం కావాలంటే.. ఈ నాచురల్ టిప్స్ కూడా పాటించండి. మంచి ఫలితం ఉంటుంది.

మెంతిపిండి, రోజ్ వాటర్, నువ్వుల నూనె ఫేస్ ప్యాక్
ముందుగా రెండు టేబుల్ స్పూన్ మెంతిపిండి తీసుకుని.. అందులో రోజ్ వాటర్ రెండు టేబుల్ స్పూన్, నువ్వులనూనె టీ స్పూన్ తీసుకుని బాగా కలిపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మృతకణాలు తొలగిపోయి.. కాంతివంతంగా మెరుస్తుంది.

అరటిపండు, పెరుగు, శెనగపిండి ఫేస ప్యాక్
ముందుగా బాగా అరటిపండు గుజ్జును తీసుకుని మెత్తగా చేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ శెనగపిండి కలిపి ముఖానికి పెట్టుకుని.. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.

బీట్ రూట్, పచ్చిపాలు, తేనె ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో బీట్ రూట్ రసం, రెండు టేబుల్ స్పూన్ పచ్చిపాలు, తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోయి కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తారు.

బీట్ రూట్, బియ్యం పిండి ఫేస్ ప్యాక్
చిన్న గిన్నెలో బీట్ రూట్ రసం రెండు టేబుల్ స్పూన్, రెండు టేబుల్ స్పూన్ బియ్యంపిండి కలిపి ముఖానికి పెట్టుకోండి. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. అందమైన మోము మీ సొంతం అవుతుంది.

Also Read: పది నిమిషాల్లో.. మెరిసే చర్మం మీ సొంతం

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×