Homemade Rose Gel: మహిళలు తమ ముఖ సౌందర్యాన్ని పెంచుకునేందుకు, అందంగా కనిపించేందుకు ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కొంతమంది ఏ పండగ వచ్చినా ఫేషియల్ చేయించుకోవడానికి ఇష్టపడుతుంటారు. మరి కొందరు పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఎంత చేసినా కూడా చాలా సార్లు ఆశించినంత ఫలితం కనిపించదు.
పార్లర్ లో కెమికల్ ఫేషియల్ చేయించుకున్నప్పుడు తక్కువ రోజులు మాత్రమే గ్లో కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ముఖం మళ్లీ నిర్జీవంగా కనిపిస్తుంది.ఇలాంటి సమయంలోనే ఇంట్లో తయారుచేసిన గులాబీ జెల్‌ను ఉపయోగించడం చాలా మంచిది. ఈ జెల్ ఉపయోగించిన తర్వాత, మీ ముఖంలో తాజాదనం, గ్లో కనిపించడం ప్రారంభమవుతుంది. ఏది ఏమైనా గులాబీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.క్లియర్ స్కిన్ అందిస్తుంది . మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న గులాబీ జెల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
రోజ్ జెల్ చేయడానికి కావలసినవి:
కొన్ని తాజా గులాబీ రేకులు- 1 చిన్న కప్పు
విటమిన్ ఇ క్యాప్సూల్స్- 2
అలోవెరా జెల్- 2 టీస్పూన్లు
బియ్యం నీరు- తగినంత
రోజ్ జెల్ ఎలా తయారు చేయాలి ?
ఇంట్లో రోజ్ వాటర్ తయారు చేయడానికి, ముందుగా ఒక చెంచా బియ్యాన్ని బాగా కడిగి, కొంచెం నీటిలో నానబెట్టండి. కనీసం అరగంట నానబెట్టిన తర్వాత, నీటిని ఫిల్టర్ చేయండి. తర్వాత ఈ నీటిలో తాజా గులాబీ రేకులను కలపండి. ఇప్పుడు తక్కువ మంట మీద కనీసం 5 నిమిషాలు దీనిని ఉడకనివ్వండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వడపోసి అందులో విటమిన్ ఇ క్యాప్సూల్, అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. రోజ్ జెల్ రెడీ, డబ్బాలో వేసి ఉంచుకోవాలి. మీరు ఈ జెల్‌ను 2-3 వారాలు నిల్వ చేయవచ్చు. దీనిని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు. ఈ జెల్‌ను ఉదయం , రాత్రి పడుకునే ముందు శుభ్రమైన ముఖంపై రాయండి.
Also Read: ఇలా చేస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం
గులాబీ జెల్ ప్రయోజనాలు:
ముడతలను తగ్గిస్తుంది: గులాబీ జెల్ ముఖానికి అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ముడతలు రాకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది. అంతే కాకుండా స్కిన్ ఫేయిర్‌గా ఉంచడంలో ఎంతగానో దోహదం చేస్తుంది.
డెడ్ స్కిన్ తొలగింపు: ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగించడంలో రోజ్ జెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని తరుచుగా వాడటం వల్ల ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కావాలనుకునే వారు దీనిని తరుచుగా వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మెరుపును తెస్తుంది: గ్లోయింగ్ స్కిన్ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు రోజ్ జెల్ వాడటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.