Keerthi Suresh: ప్రముఖ సీనియర్ నటి మేనక (Menaka ) కూతురిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్ (Keerthi Suresh). ‘నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మొదటి సినిమాతోనే పర్వాలేదనిపించుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత నేను లోకల్ సినిమాతో మెప్పించిన ఈమె.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)దర్శకత్వంలో మహానటి సావిత్రి (Savithri ) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది.
మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్..
ముఖ్యంగా దివంగత నటీమణి సావిత్రి క్యారెక్టర్ లో లీనమైపోయి మరీ నటించినందుకు గానూ.. సీనియర్ హీరోల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు విమర్శకులు కూడా ఈమె పై ప్రశంసలు కురిపించారంటే తన నటనతో ఏ రేంజ్ లో మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ‘అజ్ఞాతవాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన కీర్తి సురేష్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ అమ్మడు గత రెండేళ్ల నుంచి వార్తల్లో నిలుస్తోంది.
అనిరుద్ తో పెళ్లికి సిద్ధమైన కీర్తి సురేష్..
ముఖ్యంగా సినిమా జీవితం కంటే వ్యక్తిగత కారణాల వల్లే భారీ పాపులారిటీ దక్కించుకుంది. అసలేమైందంటే గత రెండు సంవత్సరాల నుంచి కీర్తి సురేష్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran)తో ప్రేమలో ఉందని, ప్రస్తుతం డేటింగ్ కూడా చేసుకుంటున్నారని, కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి కూడా జరగబోతుంది.. అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇవి కాస్త కీర్తి సురేష్ వరకు వెళ్లడంతో హర్ట్ అయిన ఈమె సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
ఒక్క మాటతో పుకార్లకు చెక్..
కీర్తి సురేష్ మాట్లాడుతూ..” సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని చూసి నేను స్పందించాల్సి వచ్చింది. ఈ ప్రచారాల వల్ల నా కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతున్నారు. నేను అనిరుద్ తో ప్రేమలో లేను.. అతనికి నాకు అసలు పెళ్లి జరగబోతోంది అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదు. ఒకరకంగా చెప్పాలి అంటే అనిరుద్ నాకు మంచి స్నేహితుడు. అది మాత్రమే నిజం. ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. దయచేసి నాపై ఇలాంటి నెగటివ్ రూమర్స్ క్రియేట్ చేయకండి” అంటూ కీర్తి సురేష్ తెలిపింది. ఇక ప్రస్తుతం తన దృష్టి అంతా కెరియర్ పైన పెట్టానని చెప్పి ఒక్క మాటతో పుకార్లకి పుల్ స్టాప్ పెట్టింది కీర్తి సురేష్. ఇకపోతే కీర్తి సురేష్ మొన్నటి వరకు సాంప్రదాయంగా నటించి గ్లామర్ పాత్రలకు దూరం జరిగిన ఈమె , ఆ మధ్య మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాతో ఒక్కసారిగా గ్లామర్ బ్యూటీగా మారిపోయింది. ఇక ఇప్పుడు తన అంద చందాలతో యువతను ఆకట్టుకుంటోంది.