రూల్స్ అంటే రూల్స్.. అందరూ పాటించాల్సిందే. అది కామన్ మ్యాన్ అయినా పోలీసులు అయినా. తాజాగా ముంబైలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా స్కూటీ మీద వెళ్తున్న ఇద్దరు పోలీసులను ఓ యువకుడు ఆపి, ఫైన్ చెల్లించాలని డిమాండ్ చేశాడు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా, నెంబర్ ప్లేట్ విరిగిపోవడాన్ని సదరు యువకుడు హైలెట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రీసెంట్ ఓ యువకుడు హెల్మెట్ తో పాటు సరైన డాక్యుమెంట్స్ లేకుండా బైక్ నడుపుతుండగా ఇదే ట్రాఫిక్ పోలీసులు అతడికి జరిమానా విధించారు. ఆ విషయాన్ని మనుసులో పెట్టుకున్న యువకుడు అదే పోలీసులను ఎలాగైనా బుక్ చేయాలనుకున్నాడు. అదే ఏరియాలో వారి కోసం కాపు కాశాడు. కొంత సేపటి తర్వాత ఇద్దరు పోలీసులు ఓ స్కూటీ మీద వెళ్లడాన్ని గమనించాడు. ఆ స్కూటీని ఆపేందుకు ప్రయత్నించాడు. ఆపకపోవడంతో వెంబడించి ఆపాడు. ఆ బైక్ కు నెంబర్ ప్లేట్ సరిగా లేదని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే హెల్మెట్ ఉందని వాదించాడు. నిబంధనలను ఉల్లంఘించిన పోలీసులు కచ్చితంగా జరిమానా చెల్లించాల్సిందేనని సదరు యువకుడు డిమాండ్ చేశాడు. ఈ ఘటనను మరో యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ బాగా హల్ చల్ చేస్తుంది.
ఈ ఘటనపై ముంబై ట్రాఫిక్ పోలీసు డిప్యూటీ కమిషనర్ పంకజ్ షిర్సాత్ స్పందించారు. ఈ ఘటన జరిగిన సమయంలో హవల్దార్లు గైక్వాడ్, షెలార్ బీట్ మార్షల్ డ్యూటీలో ఉన్నారని వెల్లడించారు. ఆ సమయంలో గైక్వాడ్ తన స్నేహితుడి స్కూటీని ఉపయోగించినట్లు చెప్పారు. “ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలో ఉన్నారు. ఆ సమయంలో హెల్మెట్ లేకుండా, సరైన డాక్యుమెంట్స్ లేకుండా బైక్ నడుపుతున్న యవకుడిని పట్టుకుని జరిమానా విధించారు. కాసేపటి తర్వాత అదే యువకుడు స్కూటీ మీద వెళ్తున్న పోలీసులను ఆపాడు. వెనుక నుంచి వెంబడించి పట్టుకున్నాడు. హెల్మెట్ లేదు. నెంబర్ ప్లేట్ విరిగిందంటూ జరిమానా కట్టాలని డిమాండ్ చేశాడు. దురుద్దేశంతోనే ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు . పోలీసు స్కూటీకి నంబర్ ప్లేట్ లేదని వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టించేది. వెనుక నంబర్ ప్లేట్ సరిగానే ఉంది. ముందు భాగం మాత్రమే సరిగ్గా లేదు” ని షిర్సాట్ వివరించారు.
This video is from Mumbai, where a youth stopped a police officer by blocking his scooter after being fined for a traffic violation. pic.twitter.com/Cldt8ySuhz
— The Nalanda Index (@Nalanda_index) October 28, 2025
Read Also: ఐఫోన్ లవర్స్ కు అలర్ట్, ఇలా ముంచేస్తారు జాగ్రత్త!
అటు రోడ్డు మీద ఇలాంటి ఘర్షణ పూరిత ఘటనల గురించి షిర్సాట్ హెచ్చరించారు. “ఇలాంటి వీడియోలు తీయడం, వాహనాలను ఆపడం చాలా ప్రమాదకరం. ఇలాంటి చర్యలు ప్రాణాలకు హాని కలిగిస్తాయి. ఎవరికైనా చలాన్ గురించి ఫిర్యాదు చేయాలనుంటే, ట్రాఫిక్ యాప్ లో కంప్లైంట్ చేస్తే సరిపోతుంది” అన్నారు.
Read Also: నవంబర్ 1 నుంచి కొత్త ఆధార్ రూల్స్, అలా చేయకపోతే పాన్ కార్డ్ ఔట్!