Python on Train: తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలకు పాములు ఇండ్లలోకి వచ్చి జనాలను భయానికి గురి చేస్తున్నాయి. ఇటీవల విశాఖలో భారీ కొండ చిలువ డ్రైనేజీలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ నడుస్తున్న రైలులో ఒక కొండచిలువ ప్రయాణికులలో భయాందోళనలను రేకెత్తించింది.
ఈ ఘటన చెన్నైకి వెళ్తున్న అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకుంది. డోర్నకల్ నుంచి విజయవాడ మీదుగా వెళ్తుండగా ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో పామును గుర్తించడంతో ప్రమాదం తప్పింది. ఖమ్మం రైల్వే స్టేషన్‌లో రైలును ఆపి, స్నేక్ క్యాచర్‌కు రైల్వే పోలీసులకు సమాచారం అందిచారు. స్నేక్ క్యాచర్ పాము పట్టడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: వైజాగ్‌లో భారీ కొండచిలువ.. 12 అడుగుల పామును చూసి జనం బెంబేలు!
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారుల ప్రకారం.. చెన్నైకి వెళ్తున్న రైలు నంబర్ 16032 అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో విధుల్లో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టిటిఈ) వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి కోచ్ నంబర్ ఎస్-2 వాష్‌రూమ్‌లో కొండచిలువ కదులుతున్నట్లు చూశాడు. ఆ సమయంలో రైలు డోర్నకల్ దాటి విజయవాడ వైపు వెళుతోంది. ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించడంతో స్నేక్ క్యాచర్‌ను పిలిచి పామును పట్టి అడవిలో వదిలిపెట్టారు. తరువాత రైలు ఎటువంటి ఆలస్యం లేకుండా బయలుదేరింది. ప్రయాణికులు, RPF సిబ్బంది, స్నేక్ క్యాచర్ మస్తాన్ ను అభినందించారు.