BigTV English
Advertisement

Fetus: తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోలికలు ఎలా వస్తాయి?

Fetus: తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోలికలు ఎలా వస్తాయి?

Fetus: ఒక శిశువు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటుంది. ఈ తొమ్మిది నెలల పాటు ఆ శిశువులో చాలా మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు శిశువు బరువు, అవయవాలు, పోలికలు వంటివి కావచ్చు మరింకేమైనా కావచ్చు. అయితే, అప్పుడే జన్మించిన శిశువును చూసిన వాళ్లు ఎవరైనా అమ్మ పోలిక, నాన్న పోలిక, తాత పోలిక లేదా ఇంకెవరైనా పోలికలో ఉందని అనడం మనం చాలాసార్లు వినే ఉంటాం. ఈ పోలికలు అనేవి శిశువు తల్లి గర్భంలో ఉండగా ఏర్పడతాయి. అయితే, ఇవి దేనిని ఆధారంగా చేసుకుని ఏర్పడతాయనే విషయాన్ని ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి.


పోలిక ఎలా?
తల్లి గర్భంలో శిశువుకు పోలికలు ఏర్పడటం అనేది ఒక బయోలాజికల్ ప్రాసెస్. ఇది ముఖ్యంగా జీన్స్ లేదా జెనెటిక్ సైన్స్ మీద ఆధారపడి జరుగుతుంది. శిశువు శారీరక లక్షణాలు, అవయవాలు, రంగు, ఆకారం వంటి పోలికలు తల్లిదండ్రుల నుండి లేదా వారసత్వంగా వచ్చిన జీన్స్ ద్వారా ఏర్పడతాయి. మానవ శరీరంలోని ప్రతి సెల్ లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇవి 23 జతలుగా సపరేట్ చేసి ఉంటాయి. ఈ 46 క్రోమోజోమ్స్ లో సగం తల్లి నుండి, సగం తండ్రి నుండి శిశువుకు వస్తాయి. ఈ క్రోమోజోమ్స్ లో ఉండే డీఎన్ఏ (DNA) లోనే జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ శిశువులోని లక్షణాలను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు, శిశువు కంటి రంగు, జుట్టు రంగు, ఎత్తు, ముఖ ఆకృతి, చేతులు, కాళ్ళు వంటివి ఈ జీన్స్ ద్వారా ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు.

ALSO READ: కాటన్ బడ్స్ వాడితే చెవుడు వస్తుందట.. మరి క్లీన్ చేసుకోవడమెలా?


జీన్స్..!
ఈ పోలికలు ఏర్పడే ప్రాసెస్‌లో రెండు రకాల జీన్స్ పనిచేస్తాయి. ఒకటి డామినెంట్ జీన్స్, ఇంకోటి రిసెసివ్ జీన్స్. శిశువులోని ఏదైనా ఒక లక్షణం డామినెంట్ జీన్స్ ద్వారా ఏర్పడినట్లైతే ఆ లక్షణం తల్లికి లేదంటే తండ్రికి స్పష్టంగా కలిగి ఉంటుంది. ఉదాహరణకు పొడవైన చేతి వేళ్ళు ఆధిపత్య లక్షణం కావచ్చు, తల్లిదండ్రులలో ఒకరికి ఈ జీన్స్ ఉంటే శిశువుకు వచ్చే అవకాశం ఎక్కువ. రిసెసివ్ జీన్స్ రెండు కాపీలు అంటే కొంత తల్లి నుండి కొంత తండ్రి నుండి ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి. అయితే, కొన్ని లక్షణాలు జీన్స్ తో పాటు పర్యావరణ కారణాల ద్వారా కూడా ఏర్పడతాయి. తల్లి గర్భంలో శిశువు పెరిగే సమయంలో ఆమె ఆహారం, ఒత్తిడి, ఆరోగ్యం వంటి ఇతర కారణాలు కూడా శిశువు లక్షణాలపై కొంత ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు, తల్లి పోషకాహార లోపం ఉంటే, శిశువు శారీరక పెరుగుదలపై గట్టి ప్రభావం పడుతుంది.

జీన్స్‌లో తేడాల కారణంగా, శిశువు తల్లిదండ్రుల లక్షణాలతో కలగలిసి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు వారి ముందు తరాల వారి జీన్స్ కూడా శిశువులో కనిపించవచ్చు. ఉదాహరణకు కొంత మందికి నానమ్మ, తాతల పోలికలు రావచ్చు. ఈ విధంగా శిశువు పోలికలు తల్లిదండ్రులు, వారసత్వం, తల్లి గర్భంలోని పర్యావరణం ఇలా రకరకాల కారణాలతో ఏర్పడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

Related News

Calcium Rich Foods: ఒంట్లో తగినంత కాల్షియం లేదా ? అయితే ఇవి తినండి !

Black Tea vs Black Coffee: బ్లాక్ టీ vs బ్లాక్ కాఫీ.. ఈ రెండిట్లో మీ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

Pumpkin Seeds: గుమ్మడి గింజలు తింటున్నారా ? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Fish Fry: సింపుల్‌గా ఫిష్ ఫ్రై.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్

Japanese Gen Z: జపాన్ Gen Z.. సె*క్స్ చేయరట, పాతికేళ్లు వచ్చినా ఆ అనుభవానికి దూరం, ఎందుకంటే?

Neck Pain: మెడ నొప్పా ? ఈ లక్షణాలుంటే.. అస్సలు లైట్ తీసుకోవద్దు !

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Big Stories

×