Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో రోహిత్ శర్మకు ( Rohit Sharma ) సంబంధించిన రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబైలోని వాం ఖడే స్టేడియం ( Wankhede Stadium in Mumbai ) వేదికగా రోహిత్ శర్మకు అరుదైన గౌరవం కూడా దక్కింది. రోహిత్ శర్మకు ప్రత్యేకంగా స్టేడియంలో స్టాండ్ ఏర్పాటు చేశారు. దీన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే శరత్ పవర్ , రోహిత్ శర్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఓపెన్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ సంఘటన మరువక ముందే రోహిత్ శర్మకు సంబంధించిన అరుదైన వీడియో వైరల్ అవుతుంది.
Push Ups తో రెచ్చిపోయిన రోహిత్ శర్మ
టీమిడియా కెప్టెన్ రోహిత్ శర్మ బాడీ స్టైల్ పై చాలాసార్లు ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ కంటే.. బరువు ఎక్కువగా ఉంటాడని రోహిత్ శర్మ పై దారుణంగా కామెంట్లు పెడుతూ ఉంటారు. అలాగే రోహిత్ శర్మకు బొర్ర ఉంది అని కూడా కొంతమంది ట్రోల్లింగ్ చేస్తూ ఉంటారు. రోహిత్ శర్మకు పరిగెత్తడం కూడా రాదని అంటూ ఉంటారు. అయితే అలాంటి వారికి తాజాగా రోహిత్ శర్మ ఓ వీడియో ద్వారా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు.
Also Read: BJP on Pakistan : ఆపరేషన్ సిందూర్.. పాకిస్థాన్ చుక్కలు చూపించారుగా.. ఒక్కటి మిస్ కాలేదు !
తాజాగా జిమ్ కు వెళ్లిన రోహిత్ శర్మ…రెచ్చిపోయాడు. వేగంగా push ups చేస్తూ కనిపించాడు రోహిత్ శర్మ. బ్లాక్ టీ షర్ట్ అలాగే పాయింట్ ధరించిన రోహిత్ శర్మ బ్లాక్ క్యాప్ కూడా పెట్టాడు. ఈ తరుణంలోనే జిమ్నాస్టిక్స్ చేసినట్లుగానే జిమ్లో రచ్చ రచ్చ చేశాడు. విరాట్ కోహ్లీ అనుకుంటే.. అంతకుమించి push ups చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో చివర్లో… గాల్లోకి రోహిత్ శర్మ ఎగరడం, అలాగే కాళ్లు పైకి లేపడం.. లాంటివి కూడా చేశాడు.
ఇక ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు… ఉలిక్కి పడుతున్నారు. క్వింటల్ కు పైగా బరువు ఉండే రోహిత్ శర్మ ఇలా ఎలా పుషప్స్ చేస్తున్నాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు క్రికెట్ అభిమానులు. విరాట్ కోహ్లీ అభిమానులైతే.. అది రోహిత్ శర్మ కాదంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఫేస్ ఎడిటింగ్ చేసి రోహిత్ శర్మ ఫోటో పెట్టారని.. సెటైర్లు కూడా పేల్చుతున్నారు. కానీ రోహిత్ శర్మ అభిమానులు మాత్రం ఈ వీడియోను వైరల్ చేసి… మావోడిలాగా ఎవరు పుషప్స్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కి కూడా ఇది సాధ్యం కాదని చెబుతున్నారు. టీమిండియాకు విజయాలను అందించడంలో రోహిత్ శర్మ… పాత్ర చాలా కీలకమని.. విరాట్ కోహ్లీ దేనికి పనికిరాడు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
?igsh=NjQ2NHJ5cGV0aTRo