Ear Care: చెవులు శుభ్రంగా ఉంచుకోవడం మంచి వినికిడి కోసం, సౌకర్యంగా ఉండటానికి చాలా ముఖ్యం. కానీ, చెవులను తప్పుగా శుభ్రం చేస్తే ఇన్ఫెక్షన్లు, చెవిలో మైనం ఎక్కువైపోవడం లేదా చెవి కాలువలో గాయం అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో సులభమైన పద్ధతులతో చెవులను సురక్షితంగా శుభ్రం చేసుకోవడం ఎలా అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది.
చెవులను ఎందుకు క్లీన్ చేయాలి?
చెవిలో సెరుమెన్ అనే మైనం సహజంగా ఉత్పత్తి అయ్యే పదార్థం. ఇది చెవి కాలువను దుమ్ము, బ్యాక్టీరియా, ధూళి నుండి కాపాడుతుంది. సాధారణంగా మైనం తనంతట తాను బయటకు వస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది ఎక్కువై, చెవిలో ఇబ్బంది, వినికిడి సమస్య, లేదా దురద వంటివి కలిగిస్తుంది. అందుకే చెవులను శుభ్రం చేయడం అవసరం.
ఏం చేయకూడదు?
చెవులు శుభ్రం చేసే ముందు, ఏం చేయకూడదో తెలుసుకోవాలి. కాటన్ స్వాబ్స్, బాబీ పిన్స్, లేదా పేపర్ క్లిప్స్ వంటి వాటిని చెవిలో పెట్టడం మానేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇవి మైనాన్ని లోపలికి నెట్టి, చర్మాన్ని చికాకు చేయొచ్చట. లేదా ఇయర్ డ్రమ్ గాయపడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇయర్ క్యాండిల్స్ వాడటం కూడా ప్రమాదకరం, ఎందుకంటే అవి పని చేయవు, కాలిన గాయాలు లేదా మైనం చెవిలో పడే అవకాశం ఉంది. అలాగే, చెవులను ఎక్కువగా శుభ్రం చేయడం మానేయండి, ఎందుకంటే కొంత మైనం చెవి రక్షణకు అవసరం.
ఏం చేస్తే సేఫ్?
ఇంట్లో చెవులను శుభ్రం చేయడానికి రెండు సురక్షితమైన, సులభమైన కొన్ని పద్ధతులు ఉన్నాయి. అయితే ఇంట్లోనే చెవులు క్లీన్ చేసుకోవాలనుకునే వారు.. ఇప్పటికే చెవిలో నొప్పి, వినికిడి సమస్య, లేదా చెవి సమస్యలు ఉంటే, ముందుగా డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
చెవులను శుభ్రం చేయడానికి సులభమైన మార్గం బయటి భాగాన్ని శుభ్రం చేయడం. మృదువైన, తడి గుడ్డ లేదా టిష్యూ వాడి చెవులను శుభ్రం చేయడం మంచిది.
ALSO READ: దడ పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్
శుభ్రమైన గుడ్డను గోరువెచ్చని నీటిలో తడపాలి. గుడ్డను పిండి, నీరు కారకుండా చూసుకోవాలి. చెవి బయటి భాగాన్ని, మడతలను, చెవి వెనుక భాగాన్ని సున్నితంగా తుడవాలి.
శుభ్రమైన టవల్‌తో తడి తొలగించాలి. ఈ పద్ధతి అందరికీ సురక్షితం, రోజూ చేయొచ్చు. చెవిని శుభ్రంగా ఉంచేందుకు ఇది సహాయపడుతుంది.
ఇయర్‌వాక్స్ సాఫ్టనర్
చెవిలో మైనం ఎక్కువగా ఉంటే, ఫార్మసీలో దొరికే ఇయర్‌వాక్స్ సాఫ్టనర్ లేదా సెలైన్ సొల్యూషన్ వాడొచ్చు. ఇవి మైనాన్ని మెత్తగా చేసి, సహజంగా బయటకు వచ్చేలా చేస్తాయి. ఫార్మసీలో మినరల్ ఆయిల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, లేదా సెలైన్ ఉంటాయి. డ్రాప్స్‌ను వాడే ముందు సూచనలను జాగ్రత్తగా చదవాలి. సాధారణంగా, తలను ఒకవైపు వంచి, కొన్ని చుక్కలు చెవిలో వేయాలి.