Ahmedabad: తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకులు కావాలని కోరుతూ కోర్టుకి ఎక్కాడు ఓ ఎన్నారై. విడాకులు మంజూరు చేసిన న్యాయస్థానం, ఎన్నారై భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. భార్యకు భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది. న్యాయస్థానం తీర్పుతో షాకయ్యాడు ఆ ఎన్నారై. అసలేం జరిగింది?
అహ్మదాబాద్‌లోని సబర్మతి ప్రాంతానికి చెందిన వ్యక్తి, గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళను మ్యారేజ్ చేసుకున్నాడు. వీరి వివాహం 2006లో జరిగింది. గుజరాత్ నుంచి తర్వాత ఆ దంపతులు అబుదాబి వెళ్లారు. అక్కడే కాపురం పెట్టారు. పెళ్లయిన ఆరేళ్లకు వారికి కొడుకు పుట్టాడు.
మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. భార్యను వేధించడం మొదలుపెట్టాడు ఆ భర్త. రోజురోజుకూ ఇంట్లో గొడవలు ముదిరిపాకాన పడ్డాయి. భర్తతో ఉండలేక నాలుగేళ్ల తర్వాత అంటే 2016లో ఇండియాకు తిరిగి వచ్చేసింది ఆ మహిళ. మరుసటి ఏడాది 2017లో సబర్మతి పోలీసులకు గృహ హింస, మహిళల రక్షణ చట్టం కింద ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.
ఈ క్రమంలో ఎన్నారై భర్త విడాకుల కోసం అహ్మదాబాద్ కోర్టును ఆశ్రయించాడు. భార్య కూడా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనకు భరణం కావాలని ప్రస్తావించింది. 2023 జనవరి 20న విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం. అంతకుముందు ఆమెకు, వారి కుమారుడికి కలిపి నెలకు రూ. 40 వేలు కింద భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
ALSO READ: నేలను బలంగా ఢీ కొట్టిన హెలికాఫ్టర్, కేదార్‌నాథ్‌లో వైద్య టీమ్ సేఫ్
అంతేకాదు ఇంటి అద్దె కింద మరో రూ.20 వేలు చెల్లించాలని తీర్పులో ఆదేశించింది. చివరకు పరిహారం కింద రూ.25 లక్షలు కూడా చెల్లించాలని ఆదేశించింది. బాధిత మహిళ గృహ హింసకు గురైందని న్యాయస్థానం గుర్తించింది. కోర్టు తీర్పుపై ఆ ఎన్నారై భర్త జడ్జి ముందు తన గోడు వెల్లబోసుకున్నాడు.
తాను ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నానని భరణం ఇవ్వలేనని ప్రస్తావించాడు ఆ ఎన్నారై. ఆ వ్యక్తి వాదనను చివరకు న్యాయస్థానం నమ్మలేదు. అబుదాబిలో రెండో భార్యతో జీవిస్తున్న ఆ వ్యక్తి, భరణం తప్పించుకునేందుకే నిరుద్యోగినని అబద్దం చెప్పాడని తేల్చేసింది. చివరకు భార్యకు భరణం చెల్లించాల్సిందేనని తీర్పులో వెల్లడించింది న్యాయస్థానం.