E-Paper
Advertisement

హుండీలో డబ్బులు ఎంత వేయాలి? దానికీ ఓ లెక్క ఉంటుంది, ఈ రెండూ ఉన్నాయి

హుండీలో డబ్బులు ఎంత వేయాలి? దానికీ ఓ లెక్క ఉంటుంది, ఈ రెండూ ఉన్నాయి
Advertisement

Hundi: సాంప్రదాయబద్దంగా మనం చేసిన ప్రతీ పనికీ ఓ లెక్క ఉంటుంది.. దాని వెనుక చాలా లెక్కలు ఉంటాయి. తేడా వస్తే ఇబ్బందులు తప్పవు కూడా. అందుకు రకరకాల కారణాలు లేకపోలేదు. దేవాలయాలకు వెళ్లిన ప్రతీసారి మనకు కలిగినంత డబ్బులు హుండీలో వేస్తుంటాము. దానికీ ఓ లెక్క ఉంది. తేడా వస్తే మంచి బదులు కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వుంటుందని చెబుతారు పెద్దలు. ఆ విషయం మీకు తెలుసా?

హుండీలో డబ్బులు ఎంత వేయాలి?

Advertisement

పూర్వకాలం ఏ పని చేసినా పద్దతి ప్రకారం చేసేవారు. అదే మనకు పెద్దలు చెప్పేవారు. ఉద్యోగాల నిమిత్తం సిటీకి వచ్చిన తర్వాత వాటిని దూరంగా పెట్టేయడం మొదలుపెట్టాము. పురాణాల్లో అన్ని క్లియర్ వివరించారు అప్పటి పెద్దలు. హుండీలో డబ్బులు వేయడమే కాదు, దానివల్ల మంచి చెడులు కూడా ఉంటాయి. మనం సంపాదించిన దాంట్లో ఎంతైనా దానధర్మాలు చేయాలని పెద్దలు చెబుతారు. అవే వాళ్లు చేసేవారు.

ఒకవేళ దానధర్మాలు చేయకుంటే దేవాలయాలకు ఎంతో కొంత సొమ్ము విరాళంగా ఇచ్చేవారు. రూ. 1116 , రూ.516, రూ.101 ఇలా ఇచ్చేవారు. కొన్ని జ్యోతిష్యులు వీటి గురించి చెబుతున్నారు. దేవుడి దర్శనం తర్వాత ప్రతి భక్తుడు తన ఆర్థిక స్తోమత బట్టి కలిగినంత హుండీలో కానుకలు వేస్తారు.

Advertisement

ఏ దేవుళ్లకు ఎంత వేస్తే కరుణిస్తారు?

భక్తితో సమర్పించే ఏ కానుకైనా దేవుడు స్వీకరిస్తాడని చెబుతున్నాయి పురాణాలు. హుండీలో డబుల్ డిజిట్ డబ్బులు వేయడం వెనుక కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. సంఖ్య శాస్త ప్రకారం 11 ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఒక సంఖ్యని సూర్యుడికి చిహ్నంగా చెబుతారు. అదే 11 సంఖ్యను ఆధ్యాత్మికంగా శక్తివంతమైనదిగా వర్ణిస్తుంటారు.

కష్టాలు-అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు దేవుడి హుండీలో రూ.7 వేయమని పెద్దలు సలహా ఇస్తుంటారు. ఆ ఫిగర్ ఎందుకు వేయాలన్నది మాత్రం చెప్పరు. తిరుమల ఏడుకొండల స్వామి ఆలయానికి వెళ్తే తప్పనిసరిగా రూ. 7 రూపాయలు ఎందుకంటే ఆయన ఏడు కొండల్లో కొలువై ఉంటారని చెబుతారు. అంతేకాదు రూ.17, రూ.107, రూ.1007 వంటివి వేయవచ్చని పురోహితులు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతారు.

ఇక రూ. 9 విషయానికి వద్దాం. దీనివల్ల ఇది నవగ్రహాల సూచిక. పురాణాల్లో కొన్ని లెక్కలు 9 సంఖ్యను ప్రధానంగా ఉపయోగిస్తారు. రూ.9 వేయడం వల్ల శత్రుభయం, శనిగ్రహ దోష ప్రభావం తగ్గుతుందని బలంగా నమ్ముతారు. దుర్గా దేవి ఆలయాల్లో రూ. 9, రూ.109, రూ. 1009 వేయడం వల్ల శక్తి పెరుగుతుందని చెబుతారు.

ALSO READ: సెలవుల్లో ఊరెళ్తున్నారా? కిచెన్ సింక్‌లో గ్లాస్ నీళ్లు.. తిరిగి వచ్చేసరికి జరిగేది ఇదే!

శివాలయాల్లో రూ. 11 రూపాయలు, రూ 111, రూ 211 వేయడం వల్ల మనసు శాంతి, చంద్ర బలం పెరుగుతుందని అంటారు. దీనివల్ల అప్పులు, రుణబాధలు తొలుతాయని నమ్ముతారు. రూ.12 వేయడం వల్ల సుఖశాంతులు కలుగుతాయని బలంగా నమ్ముతారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్నది నమ్మకం కూడా.

గణపతి ఆలయంలో రూ. 21, రూ. 121 తప్పనిసరిగా వేయాలని అంటుంటారు. దీనివల్ల అదృష్ణం, శుభం, భాగ్యం కలుగుతాయని కొందరు పురోహితుల మాట. గురు సంబంధిత దేవతలైన దక్షిణామూర్తి, దత్తాత్రేయ, సాయిబాబాకు రూ. 54 వేస్తే మంచిదని చెబుతారు. ఏమైనా జాతక దోషాలు, పూజలకు రూ. 101 ఇవ్వడం అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని అంటారు. హోమాలు, దానాలు చేసేటప్పుడు రూ. 108 ఇవ్వడం చాలా మంచిదని అంటారు పురోహితులు.

Related News

పార్టీలు, పెళ్లిలకు వెళుతున్నారా? డ్రెస్‌కు సరిపోయే జ్యువెలరీ ఇలా సెలెక్ట్ చేయండి

ఆషాఢ మాసం వచ్చేసింది.. కొత్త దంపతుల ఎడబాటు కష్టాలు, దాని వెనుక సీక్రెట్ అదే

సెలవుల్లో ఊరెళ్తున్నారా? కిచెన్ సింక్‌లో గ్లాస్ నీళ్లు.. తిరిగి వచ్చేసరికి జరిగేది ఇదే!

వందల ఏళ్లయినా తేనె ఎందుకు పాడవదు? అసలు సీక్రెట్ తెలిస్తే.. మైండ్ బ్లాకే!

రియల్ లైఫ్ జేమ్స్ బాండ్.. ఈ తేదీల్లో జన్మించిన వారు ఏదైనా కనిపెట్టేస్తారు

అరటి పండ్లు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనక ఉన్న క్రేజీ సైన్స్ ఇదీ!

పాము కాటేసిన తరువాత ఎంతసేపు నిద్రపోకూడదు.. నిద్రపోతే ఏమవుతుంది?

Big Stories

Advertisement
×