E-Paper
Advertisement

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !
Advertisement

Lenin Movie Review:ఏజెంట్ తర్వాత దాదాపు మూడేళ్ల విరామం తీసుకుని సాలిడ్ హిట్ కోసం ‘లెనిన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అఖిల్ అక్కినేని. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాతో జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహాభారతం రిఫరెన్సులతో ట్రైలర్ వదులుతూ సినిమాపై ఊహించని హైప్ తీసుకొచ్చారు. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత బొమ్మ ఎలా పడింది? లెనిన్ మూవీతో అఖిల్ హిట్ కొట్టాడా? ముఖ్యంగా మాస్ పాత్రలో అఖిల్ ఎలా ఒదిగిపోయారు? అనే విషయాలు రివ్యూలో చూద్దాం..

మూవీ స్టోరీ..

సినిమా స్టోరీ విషయానికి వస్తే.. చిత్తూరు జిల్లాలోని శ్రీ రామాపురం అనే ఒక ఊరికి లెనిన్ (అఖిల్) అనే ఒక అనాథ ఆకలితో వస్తాడు. ఆ ఊరికి చెందిన పెద్దింటి మహిళ (ఈశ్వర్ రావు) లెనిన్ ను చేరదీసి అన్నం పెడుతుంది. ఆమె కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు), లెనిన్ ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. వసంత్ చదువుల కోసం పట్నం వెళ్ళగా.. లెనిన్ మాత్రం ఊర్లోనే ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా నిలుస్తాడు. ఊళ్లో 18 రోజులపాటు ఎంతో పవిత్రంగా జరిగే భారతం మెట్ట ఉత్సవాల నిర్వహణ బాధ్యతను తన భుజాలపై వేసుకొని నడిపిస్తూ ఉంటాడు. తనకు భారతి (భాగ్యశ్రీ బోర్సే) అంటే ప్రాణం. ఇక ఆ ఊర్లో ఉత్సవాల ఆఖరి రోజు అనూహ్యంగా ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. దాంతో భారతం మెట్ట ఎంతకీ ఆరని అగ్నిగుండంలా రగిలిపోతుంది. ఇక ఆ సమయంలో లెనిన్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది.. ఇక కొన్నాళ్లు జైలు జీవితం గడిపి బయటకొచ్చిన లెనిన్ నేరుగా ఎక్కడికి వెళ్తాడు? ఏం చేశాడు? అసలు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? తన ప్రాణ స్నేహితుడైన వసంత్ లెనిన్ ను ఎందుకు మోసం చేశాడు? లెనిన్ ప్రేయసి భారతికి జరిగిన అన్యాయం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా వుందంటే?

Advertisement

కథ పాతదే.. అందులో కొత్తదనం ఏమి కనిపించలేదు.. లెనిన్ స్టోరీ చూశాక ఇటువంటి పల్లెటూరి పగటి కథలు మనం ఎన్ని చూడలేదు అనే భావన కలుగుతుంది. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కి, లాజిక్ కి అసలు పొంతనే లేదు. ముఖ్యంగా అసలు హీరో జైలుకెందుకు వెళ్లాడో కూడా పక్కా క్లారిటీ ఇవ్వరు. మధ్యలో వచ్చే పాటలు బ్రేకులు వేసినట్టు ఉంటాయి. స్క్రీన్ మీద సీరియస్ ఎమోషన్ నడుస్తుంటే సడన్గా పాట వస్తుంది ఆ ఫీలింగ్ మొత్తం పోతుంది.

నటీనటుల పెర్ఫార్మన్స్..

ఇక ఎవరెవరు ఎలా నటించారు అనే విషయానికి వస్తే.. ఈ సినిమాలో అఖిల్ నటన మాత్రం అదుర్స్. క్యారెక్టర్ లో పక్కాగా లీనమైపోయాడు. యాక్షన్ సీక్వెన్స్ లో, ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్లలో అఖిల్ కష్టం స్క్రీన్ మీద చాలా చక్కగా కనబడుతుంది. యాక్టింగ్ పరంగా అఖిల్ కి ఇదే బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. అటు విలన్ గా చేసిన ప్రమోద్ పంజు కూడా చాలా అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా ప్రమోద్ కి ,అఖిల్ కి మధ్య వచ్చే కొన్ని ఎపిసోడ్స్, మహాభారతం లింకులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక భాగ్యశ్రీ విషయానికి వస్తే ఉన్నంతలో తన రోల్ కి ఆమె పూర్తిస్థాయి న్యాయం చేసింది. పైగా శివాజీ లాంటి వాళ్ల సపోర్టు బాగానే లభించింది.

సాంకేతిక బృందం:

Advertisement

కెమెరా వర్క్ బాగుంది. భారీ సెట్టింగ్ వేసినా సరే పల్లెటూరి ఫీలింగ్ బాగా తీసుకొచ్చారు. తమన్ మ్యూజిక్ యావరేజ్.. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది అనిపిస్తుంది. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మంచిదే కానీ దానిని తెరమీద పక్కగా దించడంలో కాస్త తడబడ్డాడు.

ప్లస్ పాయింట్స్ :

అఖిల్ మాస్ మేకోవర్, అద్భుతమైన నటన

గ్రామీణ నేపథ్యాన్ని చక్కగా చూపించిన విజువల్స్

ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు

నటీనటుల పర్ఫార్మెన్స్

మైనస్ పాయింట్స్:

ఆశించిన స్థాయిలో లవ్ ట్రాక్ లేకపోవడం

అక్కడక్కడ ల్యాగ్ అనిపించే సన్నివేశాలు

కథకు పొంతనలేని పాటలు

చివరిగా:

లెనిన్ సినిమా మొత్తం చూస్తే సగం మాత్రమే అర్థమైందనే ఫీలింగ్ తో ఆడియన్స్ బయటకు వస్తారు. అఖిల్ కష్టం కోసం కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఒకసారి చూడవచ్చు . కానీ స్టోరీలో దమ్ము లేకపోవడం, లాజిక్కులు మిస్ కావడం వల్ల బొమ్మ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఇక వీకెండ్ లో వేరే పనేం లేకపోతే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా టైం పాస్ కోసం ఒకసారి చూడవచ్చు.

లెనిన్ మూవీ రేటింగ్: 2.5/5

Related News

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

8 భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ ఒరిజినల్ తెలుగు సిరీస్.. ‘సూపర్ సుబ్బు’ అనిపించారా ?

Deewana Review : ‘దీవానా’ రివ్యూ: ప్రేమాయణం బానే ఉంది కానీ.. కొంచెం ఓపిక చేసుకొని చూడాలి భయ్యో!

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ: వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ రివర్స్ కొట్టిందా?

Big Stories

Advertisement
×