E-Paper
Advertisement

గూగుల్ షాకింగ్ రూల్.. ఒకే అకౌంట్‌తో ఎక్కువ ఫోన్లు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!

గూగుల్ షాకింగ్ రూల్.. ఒకే అకౌంట్‌తో ఎక్కువ ఫోన్లు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!
Advertisement

Android Backup Policy: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ బ్యాకప్ విధానంలో కీలక మార్పులు చేస్తూ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు గూగుల్ అకౌంట్‌తో వచ్చే ఉచిత 15GB స్టోరేజ్‌లో ఫొటోలు, వీడియోలు, పెద్ద ఫైల్స్ మాత్రమే చేరేవి. కానీ ఇకపై మీ ఫోన్ లోని యాప్ డేటా, కాల్ హిస్టరీ, ఎస్ఎంఎస్‌లు, డివైజ్ సెట్టింగ్స్ వంటి చిన్న చిన్న వివరాలు కూడా ఈ 15GB కోటా కిందకే వస్తాయి.

పెరగనున్న స్టోరేజ్ గుబులు:

ఒకటి కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ డివైజ్‌లు వాడుతున్న వారికి ఈ కొత్త పాలసీతో ఇబ్బందులు తప్పవు. మీ పర్సనల్ ఫోన్, ఆఫీస్ ఫోన్, పాత టాబ్లెట్ లేదా క్రోమ్‌బుక్ వంటివన్నీ ఒకే గూగుల్ అకౌంట్‌కు లింక్ అయి ఉంటే.. వాటన్నింటి ఆటోమేటిక్ బ్యాకప్ వల్ల 15GB స్టోరేజ్ చాలా వేగంగా నిండిపోతుంది. ఒక్కసారి ఈ ఉచిత స్పేస్ అయిపోతే, గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ కొనేవరకు కొత్త డేటాను దాచుకోవడం కుదరదు.

Advertisement

Also Read: ట్విస్ట్ అంటే ఇది.. ఆ మొబైల్‌ను క్యాన్సిల్ చేసి, ఏకంగా 7200mAh బ్యాటరీతో వస్తున్న iQOO కొత్త ఫోన్!

మన చేతుల్లోనే నియంత్రణ:

అయితే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి గూగుల్ కొత్త కంట్రోల్స్ కూడా ఇచ్చింది. ఏ డేటా బ్యాకప్ అవ్వాలి, ఏది వద్దు అనేది మనమే నిర్ణయించుకోవచ్చు. అనవసరమైన యాప్ డేటా లేదా కాల్ హిస్టరీ బ్యాకప్‌ను ఆపేయడం ద్వారా ఉచిత స్టోరేజ్‌ను చాలా కాలం పాటు కాపాడుకోవచ్చు.

సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి?

Advertisement

పిక్సెల్ ఫోన్ వాడుతుంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి Accounts and Backup క్లిక్ చేసి, Google Backup ఆప్షన్‌లో Other device dataను మార్చుకోవచ్చు. మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్లలో.. సెట్టింగ్స్ ఓపెన్ చేసి, Google Services లోని Manage Backupలోకి వెళ్లి అనవసరమైన వాటిని నిలిపివేయవచ్చు. దీంతో వేస్ట్ డేటా స్టోరేజ్‌ను ఆక్రమించకుండా ఉంటుంది.

త్వరలోనే అందరికీ అందుబాటులోకి..

గూగుల్ ఈ మార్పులను దశలవారీగా రోల్ అవుట్ చేస్తోంది. అందుకే ఈ కొత్త సెట్టింగ్స్ అందరికీ ఒకేసారి కనిపించకపోవచ్చు. అయితే ఇప్పటి నుంచే మీ గూగుల్ స్టోరేజ్ అలవాట్లను మార్చుకోవడం, పాత డేటాను అప్పుడప్పుడు క్లియర్ చేయడం మంచిది.

Also Read: మెటా వివరణ ఇచ్చినా తీరని అనుమానాలు.. WhatsApp కొత్త రూల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

Related News

తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

Big Stories

Advertisement
×