E-Paper
Advertisement

ఆషాఢ మాసం వచ్చేసింది.. కొత్త దంపతుల ఎడబాటు కష్టాలు, దాని వెనుక సీక్రెట్ అదే

ఆషాఢ మాసం వచ్చేసింది.. కొత్త దంపతుల ఎడబాటు కష్టాలు, దాని వెనుక సీక్రెట్ అదే
Advertisement

Ashadam Month: ఏ పని చేయాలన్నా మంచి రోజు చూడాలని చెబుతారు. దానివల్ల అంతా మంచి జరుగుతుందని పురాణాల్లో కూడా చెబుతారు. అందుకే మంచి వెతికి మరీ ముహూర్తాలు పెట్టుకుంటారు. మంచి రోజుల కాలం ఐపోయింది.. ఆషాఢం నాలుగు రోజుల్లో వచ్చేస్తోంది. కొత్త దంపతులకు ఎడబాటు కష్టాలు మొదలుకానున్నాయి. ఈ మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా పెడతారు?

ఆషాఢ మాసం వచ్చేసింది.. కొత్త దంపతుల ఎడబాటు కష్టాలు

Advertisement

ఆషాఢ మాసం అందరికీ మంచిని తెస్తుంది. కాకపోతే కొన్ని పనులు చేయకూడదు. దానివల్ల అరిష్టమని చెబుతారు. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుంచి మొదలు కానుంది. ఇప్పటికే పెళ్లైన కొత్త దంపతులు దూరంగా ఉండటానికి సిద్ధపడతారు. ఆ విధంగా పెద్దలు సిద్ధం చేస్తారు కూడా.

ఆషాఢంలో కొత్త దంపతులు దూరంగా ఉండాలనే ఆచారం పెట్టారు. దీనివల్ల అంతా మన మంచికే.  ఈ సమయంలో కొత్త దంపతులు ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో ఎక్కువ మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. ఆ నెలలో వర్షాలు ఎక్కువగా పడడంతో పొలం పనులు జరుగుతున్నాయి.

Advertisement

కొత్త దంపతులకు ఆషాడం.. సామాజిక సంప్రదాయం

కొత్తగా పెళ్లైన దంపతులు పనుల కంటే భాగస్వామితో ఎక్కువగా ఉండేందుకు సమయం కేటాయిస్తారు. దానివల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతుంది. అత్త గడప దాటిన ఇంట్లోకి కోడలు రాకూడదని అంటారు, దానివల్ల కుటుంబంలో మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు కొంతకాలం కొత్త వధువును పుట్టింటికి పంపే ఆచారం ఉంది. దీనికితోడు మరొక కారణం కూడా ఉంది.

ఆషాఢ మాసంలో గర్భం దాల్చితే అప్పటికి తొమ్మిది నెలలు లెక్కిస్తే వేసవికాలంలో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేసవికాలంలో కొంతదూరం నడవలేము. అలాంటి సమయంలో డెలివరీ అయితే తల్లీ-బిడ్డలకు కష్టాలు ఉంటాయి. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంప్రదాయాన్ని పాటించేవారని చెబుతారు పురోహితులు.

ఈ ఆచారం మూఢనమ్మకం కాదని వ్యవసాయం- కుటుంబ సామరస్యం-తల్లీబిడ్డల ఆరోగ్యం అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన సామాజిక సంప్రదాయంగా చెబుతున్నారు. చాలామంది దంపతులు తాము అత్తమామలకు దూరంగా ఉన్నామని, మాకెందుకు ఎడబాటని ప్రశ్నిస్తున్నారు.

ALSO READ: హుండీలో డబ్బులు ఎంత వేయాలి? దానికీ ఓ లెక్క ఉంటుంది, ఈ రెండూ ఉన్నాయి 

వేసవికాలంలో డెలివరీ అయితే ఆ తల్లికి కష్టాలు అన్నీఇన్నీ కావు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కాన్పు జరిగితే చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. దేశంలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండల వల్ల పుట్టిన తల్లి-బిడ్డకు ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఒక్కోసారి డీహైడ్రేషన్ పడే అవకాశం ఉంటుంది. ఎండల తీవ్రత నుండి రక్షించడానికే ఈ నియమం పెట్టారని చెబుతారు.

ఈ నెల రోజులు భర్తకు భార్య దూరంగా ఉండడం అభిమానం, ప్రేమ వంటికి కూడా పెరుగుతాయి. ఆషాఢంలో వర్షాలు పడడంతో వాతావరణం మారిపోతుంది. ఈ సీజన్‌లో జీర్ణక్రియ కాస్త మందగిస్తుంది. అంటువ్యాధులు వస్తాయని అంటారు. ప్రకృతి మార్పులకు అనుగుణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ కాలం ఎంతో మంచిదిగా చెబుతారు.

Related News

నోరూరించే కోనసీమ పీతల పులుసు.. ఈ పల్లెటూరి పద్ధతిలో చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు!

అచ్చమైన పల్లెటూరి రుచిలో..ఘుమఘుమలాడే ఎండుచేపల కూర!

చికెన్ లవర్స్ కోసం స్పెషల్ డిష్..రుచికరమైన వైట్ మలయ్ చికెన్ కర్రీ

ఈవినింగ్ స్నాక్స్‌కు పర్‌ఫెక్ట్ ..తిన్నాకొద్దీ తినాలనిపించే గుమగుమలాడే మసాలా వడ

‘నేను బాగానే ఉన్నా’ అన్న ప్రతీసారీ నమ్మకండి.. పిల్లల ఆ ప్రవర్తన వెనుక పెద్ద రహస్యమే ఉంది!

హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

మీ భార్య మీతో ఈ విషయాలు దాచిపెడుతోందా? రిలేషెన్‌ షిప్‌పై పడే ప్రభావం ఇదే

జి మెయిల్, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్.. అన్ని అకౌంట్ పాస్ట్‌వర్డ్స్ మర్చిపోతున్నారా? సమస్యకు పరిష్కారం ఇదిగో

Big Stories

Advertisement
×