E-Paper
Advertisement

సెలవుల్లో ఊరెళ్తున్నారా? కిచెన్ సింక్‌లో గ్లాస్ నీళ్లు.. తిరిగి వచ్చేసరికి జరిగేది ఇదే!

సెలవుల్లో ఊరెళ్తున్నారా? కిచెన్ సింక్‌లో గ్లాస్ నీళ్లు.. తిరిగి వచ్చేసరికి జరిగేది ఇదే!
Advertisement

Kitchen Sink Tips: సెలవులు వచ్చాయంటే చాలు.. చాలామంది ఇళ్లకు తాళాలు వేసి హాయిగా ఊర్లకు ప్రయాణమవుతుంటారు. అయితే ఇంటికి తిరిగి రాగానే.. ఇల్లంతా ఒక విధమైన కుళ్లిన వాసక వస్తూ ఉంటుంది. అలాగే దోమలు, బొద్దింకలు, పరుగులు.. ఎక్కడిక్కడ దర్శనమిస్తుంటాయి. అయితే ఒక గ్లాస్ వాటర్ తో ఈ సమస్యలన్నింటికీ చెక్ పట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సింక్ లో గ్లాస్ వాటర్ పెట్టడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

డ్రైనేజీ పైపుల సీక్రెట్

ఇళ్లలోని కిచెన్ సింక్, వాష్ బేసిన్ కింద ఉండే పైపులను గమనిస్తే.. అవి ఇంగ్లీష్ అక్షరం ‘U’ లేదా ‘P’ ఆకారంలో వంగి ఉంటాయి. దీనిని ప్లంబింగ్ భాషలో ‘పి-ట్రాప్’ అంటారు. మనం సింక్ వాడిన ప్రతిసారీ ఆ వంపులో కొద్దిగా నీరు నిలిచిపోతుంది. ఈ నిలిచిన నీరు ఒక సహజమైన మూతలా పనిచేస్తుంది. డ్రైనేజీ పైపుల నుండి వచ్చే చెడు వాయువులు, దుర్వాసన, క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఈ నీరే అడ్డుకుంటుంది.

ఊరెళ్లినప్పుడు ఏం జరుగుతుందంటే?

Advertisement

ఇంట్లో ఉన్నప్పుడు రోజూ సింక్ వాడుతుంటాం కాబట్టి ఆ వంపులో నీరు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కానీ మీరు వారం లేదా పది రోజులు ఊరెళ్లినప్పుడు సింక్‌ను వాడే పరిస్థితి ఉండదు. దీనివల్ల ఆ వంపులో ఉన్న కొద్దిపాటి నీరు కాలక్రమేణా ఆవిరైపోతుంది. ఆ నీటి పొర ఎండిపోగానే, డ్రైనేజీలో ఉండే గ్యాస్ నేరుగా కిచెన్‌లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఇల్లంతా మురుగు వాసన వచ్చేస్తుంది. అంతేకాకుండా ఆ పైపుల ద్వారా బొద్దింకలు, ఇతర పురుగులు ఈజీగా ఇంట్లోకి వచ్చేస్తాయని నిపుణులు అంటున్నారు.

Also Read: కంపెనీ vs లోకల్ మెకానిక్.. ఫ్రిజ్, ఏసీ, టీవీ పాడైతే.. ఎవరితో రిపేర్ చేయిస్తే బెస్ట్?

గ్లాసు నీళ్ల ట్రిక్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

పైన పేర్కొన్న సమస్యలు రాకుండా ఉండాలంటే ఒక గ్లాస్ వాటర్ ను సింక్ లో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా సింక్ హోల్‌లో గ్లాసు నీటిని నెమ్మదిగా పోయాలి. దీనివల్ల పి-ట్రాప్‌లో నీరు నిండిపోతుంది. ఆ తర్వాత ఒక గ్లాసును లేదా ఏదైనా ప్లేటును బోర్లించి ఆ సింక్ రంధ్రాన్ని పూర్తిగా మూసేయాలి. ఇలా చేయడం వల్ల పైపులో ఉన్న నీరు త్వరగా ఆవిరి కాకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ కొద్దిగా ఆవిరైనా, పైన గ్లాస్ ఉండటం వల్ల డ్రైనేజీ పురుగులు, వాసనలు బయటకు రాలేవని స్పష్టం చేస్తున్నారు.

Also Read: జాబ్ చేస్తూనే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలా? నెలకు రూ.20,000 వచ్చే.. 5 తేలికైన మార్గాలు ఇవే!

Related News

ఫిష్ ప్రియులు ‘కరిమీన్ పొల్లిచాతు’ ఇలా ట్రై చేయండి.. ఈ రుచిని అస్సలు మర్చిలేపోరు!

మటన్ ప్రియుల కోసం గుంటూరు స్పెషల్ గోంగూర మటన్.. తయారీ విధానం ఇదిగో!

నోరూరించే కోనసీమ పీతల పులుసు.. ఈ పల్లెటూరి పద్ధతిలో చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు!

అచ్చమైన పల్లెటూరి రుచిలో..ఘుమఘుమలాడే ఎండుచేపల కూర!

చికెన్ లవర్స్ కోసం స్పెషల్ డిష్..రుచికరమైన వైట్ మలయ్ చికెన్ కర్రీ

ఈవినింగ్ స్నాక్స్‌కు పర్‌ఫెక్ట్ ..తిన్నాకొద్దీ తినాలనిపించే గుమగుమలాడే మసాలా వడ

‘నేను బాగానే ఉన్నా’ అన్న ప్రతీసారీ నమ్మకండి.. పిల్లల ఆ ప్రవర్తన వెనుక పెద్ద రహస్యమే ఉంది!

హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×