E-Paper
Advertisement

వందల ఏళ్లయినా తేనె ఎందుకు పాడవదు? అసలు సీక్రెట్ తెలిస్తే.. మైండ్ బ్లాకే!

వందల ఏళ్లయినా తేనె ఎందుకు పాడవదు? అసలు సీక్రెట్ తెలిస్తే.. మైండ్ బ్లాకే!
Advertisement

Does honey ever expire or spoil: మన వంటింట్లో ఉండే ఏ వస్తువైనా కొన్ని రోజులు లేదా నెలలు దాటితే పాడైపోతుంది. పాలు, పెరుగు, పండ్లు.. ఆఖరికి పప్పులు కూడా పురుగు పడతాయి. కానీ.. కాలంతో సంబంధం లేకుండా, యుగాలు మారినా అస్సలు పాడవని ఒకే ఒక్క అద్భుతమైన ఆహారం ఉంది.. అదే ‘తేనె’! అవును, మీరు విన్నది నిజమే. స్వచ్ఛమైన తేనెకు అసలు ఎక్స్‌పైరీ డేటే ఉండదు. వందల ఏళ్లయినా అది అలాగే తాజాగా ఉంటుంది. మరి తేనెకు ఉన్న ఈ సూపర్ పవర్ వెనక ఉన్న అసలు నిజం ఏంటో, సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం.

పిరమిడ్లలో దొరికిన 3000 ఏళ్ల నాటి తేనె:

తేనె ఎప్పటికీ పాడవ్వదు అనడానికి చరిత్రలోనే ఒక పెద్ద ఆధారం ఉంది. ఈజిప్ట్ పిరమిడ్లలో పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపినప్పుడు, అక్కడ వేల సంవత్సరాల క్రితం నాటి సమాధుల్లో కొన్ని తేనె కుండలు దొరికాయి. సైంటిస్టులు ఆ కుండలను పరీక్షించి చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే.. దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాటి ఆ తేనె ఇప్పటికీ అస్సలు పాడవలేదు! విచిత్రం ఏంటంటే.. ఆ తేనెను ఇప్పుడు కూడా హ్యాపీగా తినేయొచ్చు. మరి మూడు వేల ఏళ్లుగా ఆ తేనె ఎలా సురక్షితంగా ఉందో తెలుసుకోవాలని ఉందా? దీని వెనక ప్రకృతి దాచిన ఒక పెద్ద సైన్స్ సీక్రెట్ ఉంది.

తేనె ఎందుకు పాడవ్వదు?

Advertisement

తేనె ఎన్ని ఏళ్లయినా పాడవకుండా ఉండటానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి.

1. తేమ శాతం చాలా తక్కువ :

బ్యాక్టీరియా లేదా ఏదైనా ఫంగస్ పెరగాలంటే అక్కడ ఖచ్చితంగా తేమ ఉండాలి. కానీ.. తేనె సహజంగానే చాలా తక్కువ తేమను కలిగి ఉంటుంది. తేనెటీగలు పూల నుంచి మకరందాన్ని సేకరించినప్పుడు అందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే.. తేనెటీగలు తమ రెక్కలతో డ్రమ్స్ లాగా గాలిని ఊపడం ద్వారా ఆ మకరందంలోని నీటిని పూర్తిగా ఆవిరి చేస్తాయి. నీరు లేని చోట ఏ జీవీ బతకలేదు కాబట్టి.. తేనెలో బ్యాక్టీరియా అస్సలు చేరలేదు.

2. అద్భుతమైన ఆమ్లత్వం:

Advertisement

తేనె పిహెచ్ విలువ దాదాపు 3.2 నుంచి 4.5 మధ్య ఉంటుంది. అంటే ఇది చాలా అసిడిక్ (ఆమ్ల గుణం) అన్నమాట. ఇంతటి అసిడిక్ వాతావరణంలో ఏ రకమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా బతకలేవు. అవి తేనెలోకి ప్రవేశించగానే చనిపోతాయి.

3. తేనెటీగల మ్యాజిక్ ఎంజైమ్:

తేనెటీగలు మకరందాన్ని తేనెగా మార్చే ప్రాసెస్ లో వాటి కడుపులో నుంచి ‘గ్లూకోజ్ ఆక్సిడేస్’అనే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్‌ను దానికి జోడిస్తాయి. ఈ ఎంజైమ్ తేనెలో ‘హైడ్రోజన్ పెరాక్సైడ్’ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన యాంటీ-సెప్టిక్ లాగా పనిచేస్తుంది. గాయాలు అయినప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాగైతే మందులు వాడతామో, తేనెకు ఈ హైడ్రోజన్ పెరాక్సైడే శ్రీరామరక్షగా మారి ఎలాంటి క్రిములు చేరకుండా కాపాడుతుంది.

Also Read: అరటి పండ్లు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనక ఉన్న క్రేజీ సైన్స్ ఇదీ!

మార్కెట్లో దొరికే తేనె ఎందుకు పాడవుతుంది?

ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం 100% సహజమైన, స్వచ్ఛమైన తేనె గురించి మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో దొరికే కొన్ని బ్రాండెడ్ తేనె సీసాలపై ఎక్స్‌పైరీ డేట్ రాసి ఉండటం మీరు చూసే ఉంటారు. ఎందుకంటే.. వ్యాపార లాభాల కోసం అందులో షుగర్ సిరప్స్, వాటర్ లేదా ఇతర రసాయనాలను కలుపుతారు. అలా కల్తీ జరిగినప్పుడు తేనెలో తేమ శాతం పెరిగి అది కొద్దిరోజులకే పాడైపోతుంది. అలాగే.. ప్యూర్ హనీ కూడా కొన్ని రోజులకు గడ్డకట్టడం జరుగుతుంది. చాలామంది ఇది చూసి పాడైపోయింది అనుకుంటారు, కానీ అది తేనె సహజ గుణం. దాన్ని కాస్త వేడి నీళ్లలో ఉంచితే మళ్లీ మామూలుగా మారిపోతుంది.

ప్రకృతి మనకిచ్చిన అత్యంత అద్భుతమైన గుణాలున్న సూపర్ ఫుడ్ తేనె. సో.. మీ ఇంట్లో ఉన్నది స్వచ్ఛమైన తేనె అయితే అది ఎన్నేళ్లయినా పాడవదు, ధైర్యంగా వాడుకోవచ్చు.

Related News

సెలవుల్లో ఊరెళ్తున్నారా? కిచెన్ సింక్‌లో గ్లాస్ నీళ్లు.. తిరిగి వచ్చేసరికి జరిగేది ఇదే!

రియల్ లైఫ్ జేమ్స్ బాండ్.. ఈ తేదీల్లో జన్మించిన వారు ఏదైనా కనిపెట్టేస్తారు

అరటి పండ్లు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనక ఉన్న క్రేజీ సైన్స్ ఇదీ!

పాము కాటేసిన తరువాత ఎంతసేపు నిద్రపోకూడదు.. నిద్రపోతే ఏమవుతుంది?

ఎద్దులు ఎరుపు రంగు చూస్తే వెంటపడతాయా? అసలు నిజం తెలిస్తే.. షాక్ అవుతారు!

ట్రూ లవర్.. ఈ తేదీలో పుట్టినవారు జీవితాంతం తోడుగా ఉంటారు

వర్షాకాలంలో వైరల్ ఫీవర్, ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం.. ఈ 6 హెల్త్ టిప్స్ పాటించడం తప్పనిసరి

Big Stories

Advertisement
×