E-Paper
Advertisement

అరటిపండు సహజంగా పండిందా లేదా కెమికల్‌తోనా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కనిపెట్టండి!

అరటిపండు సహజంగా పండిందా లేదా కెమికల్‌తోనా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కనిపెట్టండి!
Advertisement

Natural vs Artificial Ripening Of Bananas: అరటిపండు మనకు ఏడాది పొడవునా లభించే అత్యంత పోషకాలు ఉన్న ఆహారం. అయితే.. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి వ్యాపారులు ప్రమాదకరమైన రసాయనాలను (కార్బైడ్ వంటివి) ఉపయోగించి పండ్లను త్వరగా పండిస్తున్నారు. ఇలా రసాయనాలతో పండిన పండ్లు ఆరోగ్యానికి ఎంతో హానికరమని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) హెచ్చరిస్తోంది. పండ్లను సురక్షితంగా పండించడానికి FSSAI కొన్ని ప్రత్యేక నిబంధనలను, ఉష్ణోగ్రత పరిమితులను విధించింది. మనం తినే అరటిపండు సహజమైందో కాదో గుర్తించడం మన ఆరోగ్యం దృష్ట్యా చాలా ముఖ్యం.

సహజ, రసాయన అరటిపండ్ల మధ్య తేడా:

Advertisement

1. రంగు, రూపం:
సహజంగా పండినవి: ఇవి ముదురు పసుపు రంగులో ఉంటాయి. అంతే కాకుండా అక్కడక్కడా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. పండు మొత్తం ఒకే రంగులో ఉండదు. తొడిమ భాగం కొంచెం ఆకుపచ్చగా ఉండొచ్చు.

కెమికల్‌తో పండినవి: ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా, మెరుస్తూ నిమ్మ పసుపు రంగులో ఉంటాయి. పండు మొత్తం ఎక్కడా చిన్న మచ్చ లేకుండా సమానంగా పసుపు రంగులో ఉంటుంది. కానీ తొడిమ మాత్రం ముదురు ఆకుపచ్చగా ఉంటుంది.

Advertisement

2. రుచి , వాసన :
సహజంగా పండినవి: ఇవి మంచి వాసన కలిగి ఉంటాయి. అంతే కాకుండా రుచి చాలా తియ్యగా ఉంటుంది.

కెమికల్‌తో పండినవి: వీటిలో తియ్యదనం తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వెనుక రుచి కొంచెం వెగటుగా లేదా రసాయనాల వాసనతో కూడి ఉంటుంది.

3. ఆకృతి :
సహజంగా పండిన అరటిపండు తొక్క వలిచినప్పుడు లోపల గుజ్జు మెత్తగా, సమానంగా పండి ఉంటుంది. రసాయనాలతో పండిన పండు పైన పసుపుగా ఉన్నా.. లోపల కొన్ని భాగాలు గట్టిగా (పచ్చిగా) ఉండే అవకాశం ఉంది.

FSSAI నిబంధనలు , ఉష్ణోగ్రత నియమాలు:
FSSAI అరటిపండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. దీనికి బదులుగా ‘ఎథిలీన్ గ్యాస్’ను సురక్షితమైన పద్ధతిలో వాడాలని సూచించింది.

పండించాల్సిన ఉష్ణోగ్రత:
FSSAI రూల్‌బుక్ ప్రకారం.. అరటిపండ్లను శాస్త్రీయంగా పండించడానికి ఈ క్రింది నిబంధనలు పాటించాలి.

ఉష్ణోగ్రత: అరటిపండ్లను పండించడానికి గది ఉష్ణోగ్రత 14°C నుంచి 18°C మధ్య ఉండాలి.

తేమ: గదిలో తేమ శాతం 85% నుండి 95% వరకు ఉండాలి.

ఎథిలీన్ సాంద్రత: గాలిలో ఎథిలీన్ సాంద్రత 100 ppm మించకూడదు.

సమయం: ఈ నియంత్రిత వాతావరణంలో పండ్లు పండటానికి సాధారణంగా 4 నుంచి 6 రోజులు పడుతుంది.

Also Read: 2 నిమిషాల ఆహారం.. జీవితకాలపు అనారోగ్యం, నూడుల్స్‌లోని చేదు నిజాలు

నివారణ మార్గాలు:
పండ్లను తినే ముందు కనీసం 10-15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి, బాగా కడగాలి.

అతిగా మెరుస్తూ.. మచ్చలు లేని పండ్లను కొనడం తగ్గించాలి.

ఆరోగ్యం కోసం తినే పండ్లు విషతుల్యం కాకూడదు. రసాయనాలతో పండిన పండ్ల వల్ల క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. కొనే ముందు పైన తెలిపిన తేడాలను గమనించి సరైన నిర్ణయం తీసుకోండి.

Also Read: కనురెప్పలు అదరడానికి ప్రధాన కారణాలు.. ఏ విటమిన్ లోపిస్తే ఇలా జరుగుతుంది?

Related News

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

Big Stories

Advertisement
×