Chicken Pickle: వేసవి వచ్చిందంటే పచ్చళ్ల సీజన్ వచ్చేసినట్టే మామిడి కాయ పచ్చడ మొదలుకొని చింతకాయ వరకు అన్ని రకాల నిల్వ ఉండే పచ్చళ్లను తయారు చేసి రెడీగా పెట్టుకుంటారు. రోహిణీ కార్తె వచ్చన తర్వాత అప్పుడప్పుడే వాన చినుకులు పడుతుంటే పచ్చళ్లతో ఎర్రగా కలుపుకొని భోజనం చేస్తే ఆ మజానే వేరు. ఊరగాయ మాత్రమే కాకుండా చికెన్, మటన్, చేపలు వంటి వాటితో పచ్చళ్లు తయారు చేసుకొని తినాలని చాలా మంది మాంస ప్రియులు అనుకుంటారు.
వీటిని బయట కొనాలంటే అయ్యే ఖర్చు వేలలోనే ఉంటుంది. దీంతో చికెన్, మటన్ వంటి వాటితో తయారు చేసిన పికిల్స్ కొనాలంటే సామాన్యులు వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే పచ్చళ్ల కోసం వేలల్లో ఖర్చు చేయకుండా ఇంట్లోనే రుచికరమైన పికిల్స్ తయారు చేసుకుంటే బాగుంటుంది కదా..? అందుకే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేలా చికెన్ పచ్చడ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చికెన్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్- అరకేజి
పసుపు- అర టీస్పూన్
ఉప్పు- అర టీస్పూన్
ధనియాలు- 2 టీస్పూన్లు
దాల్చిన చెక్క-2
యాలకులు-3
లవంగాలు- 4
జీలకర్ర- అర టీస్పూన్
మెంతులు- పావు కప్పు
ఆవాలు- ఒక టీస్పూన్
నూనె- ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 టీస్పూన్లు
కారం- పావు కప్పు
చికెన్ పచ్చడి తయారీ విధానం:
చికెన్ పచ్చడి తయారు చేయడానికి ముందుగా అరకేజీ బోన్‌లెస్ చికెన్‌కు క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇందులో అర టీస్పూన్ పసుపు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి. ప్యాన్‌లో ధనియాలు, దాల్చిన చెక్క ముక్కలు, యాలకులు, లవంగాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. పసుపు, ఉప్పు కలిపి ఉంచిన చికెన్‌ను కూడా డ్రై రోస్ట్ చేయాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించాలి. కొద్ది సేపటికి చికెన్‌లో ఉండే నీరు శాతం తగ్గపోయి ముక్కలు గట్టిగా మారతాయి.
మరో గిన్నెలో నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వెయించాలి. ఇందులో చికెన్ ముక్కలను వేసి కలపాలి తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచిన మసాలను యాడ్ చేసి లో ఫ్లేంలో ఫ్రై చేయాలి. తర్వాత పావు కప్పు కారం, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మ రసం కూడా కలుపుకోవచ్చు.
ఈ పచ్చడిని ఎయిర్ కంటైనర్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఇందులో ఉంచితే 2-3 నెలల వరకు కూడా పచ్చడి పాడవ్వకుండా ఉంటుందట. అయితే దీన్ని తడి తగలనివ్వకుండా ఉంచితే బూజు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది.