Priyanka Jawalkar:ప్రముఖ తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్.. ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా సక్సెస్ కావడంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో చేసిన ‘టాక్సీవాలా’ సినిమా గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రియాంక జవాల్కర్ ఇటీవల విడుదలై మంచి సక్సెస్ అందుకున్న ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
భయపడి ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పలేదు – ప్రియాంక జవాల్కర్..
ఇక ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను సినిమాలు ట్రై చేస్తున్నానని మా ఇంట్లో తెలుసు. అయితే నన్ను ఇంట్లో వాళ్ళు మాత్రం నీకు నచ్చింది చేసుకో అని అన్నారు. దాంతో నాకు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. అయితే ఒక వారం రోజుల షూటింగ్ పూర్తయ్యే వరకు కూడా నేను ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. పైగా ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ లో వస్తోంది. పెద్ద కంపెనీలో నాకు మొదటి సినిమా. అసలు సినిమాలో ఉంటానో లేక మధ్యలోనే తీసేస్తారేమో అనే భయం ఉండేది. అందుకే షూటింగ్ మొదలై ఒక వారం రోజులు పూర్తి అయ్యేవరకు నేను ఈ సినిమాకి హీరోయిన్ అని చెప్పలేకపోయాను. ఇక వారం రోజుల తర్వాత షూటింగ్ పూర్తయ్యాక నేనే ఈ సినిమాకి హీరోయిన్ అని, నాకు అనిపించాకే ఇంట్లో చెప్పాను. అప్పుడు వాళ్లు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాతే అందరికీ చెప్పుకున్నాను అంటూ ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే విజయ్ దేవరకొండతో సినిమా పైగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా అనేసరికి తనను మధ్యలోనే తీసేస్తారేమో అని భయపడి, ఆ విషయాన్ని చెప్పలేదని తెలిపింది.
Ram Charan Peddi: ఫస్ట్ షాట్ తోనే సరికొత్త రికార్డు.. గాడిన పడ్డ గ్లోబల్ స్టార్..!
ప్రియాంక జవాల్కర్ కెరియర్..
ఇక ప్రియాంక జవాల్కర్ విషయానికి వస్తే.. 2017లో తెలుగులో వచ్చిన ‘కలవరం ఆయే’ అనే సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది . ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక తర్వాత తిమ్మరసు , ఎస్ఆర్ కళ్యాణమండపం, గమనం వంటి సినిమాలు చేసిన ఈమె టిల్లు స్క్వేర్ లో కూడా గెస్ట్ పాత్ర పోషించింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ లో కూడా ఆకట్టుకుంది. ఇక ఈమె బాల్యం విషయానికి వస్తే 1992 నవంబర్ 12న ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో జన్మించిన ఈమె పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందినవారు. వాళ్లు అనంతపురంలోనే స్థిరపడ్డారు. దీంతో ఈమె 10వ తరగతి వరకు అనంతపురం చిన్మయి నగర్ లో ఉన్న ఎల్ ఆర్ జి హైస్కూల్లో తన విద్యను పూర్తి చేసింది. ఇక హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె.. నటనలో ఆసక్తి పెంచుకొని ఎన్ జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. ఇప్పుడు తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసింది.