BigTV English
Advertisement

Katrina Kaif: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రీనా

Katrina Kaif: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రీనా

Katrina Kaif: బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్ – విక్కీ కౌశల్ అభిమానులకు గుడ్ న్యూస్  తెలిపారు. వారు తల్లిదండ్రులం అయ్యినట్లు చెప్పుకొచ్చారు.  నేడు కత్రీనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన్నట్లు అధికారికంగా తెలిపారు. ” మా అందరి ఆనందం వచ్చేసింది. ఎంతో ప్రేమతో.. సంతోషంతో మా బేబీ బాయ్ ను మేము ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం” అంటూ కత్రీనా – విక్కీ అధికారికంగా ప్రకటించారు. దీంతో కౌశల్ కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.


బాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగిన కత్రీనా తనకన్నా చిన్నవాడైన విక్కీ కౌశల్ తో ప్రేమలో పడి.. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి 2021 లో చాలా ఘనంగా వివాహాం చేసుకున్నారు. ఇక గత నాలుగేళ్లుగా ఈ జంట ఎప్పుడెప్పుడు శుభవార్త చేతుందా అని అభిమానులందరూ ఎంతో ఎదురుచూసారు. ఆ శుభ ముహూర్తం ఈ ఏడాదిలోనే వచ్చింది. కత్రీనా ప్రెగ్నెన్సీ వార్తను సెప్టెంబర్ లో విక్కీ అధికారికంగా ప్రకటించాడు. అప్పటికే కత్రీనా 7 నెలలు ప్రెగ్నెంట్. ఇక ఇప్పుడు ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ వార్త తెలియడంతో బాలీవుడ్ మొత్తం  విక్కీ- కత్రీనాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కత్రీనా కైఫ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో మల్లీశ్వరి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత కత్రీనా తెలుగులో కనిపించలేదు. పెళ్లి తరువాత సినిమాలను తగ్గించిన కత్రీనా.. అడపాదడపా మాత్రమే కనిపిస్తూ వస్తుంది. మరి ఇప్పుడు ఈ చిన్నది పూర్తిగా సినిమాలకు దూరం అవుతుందా…? లేదా కొన్నేళ్లు గ్యాప్ ఇస్తుందా అనేది చూడాలి.


Related News

Priyanka Chopra: హీరోయిన్ గారి ఖర్చే కోట్లలో ఉందంట.. అయినా జక్కన్న మౌనం.. కారణం ఏంటి..?

SSMB29: ఎట్టకేలకు రాజమౌళి-మహేష్‌ మూవీ నుంచి అప్‌డేట్‌.. పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

Rashmika Mandanna: విజయ్.. కచ్చితంగా నువ్వు నన్ను చూసి గర్వపడతావ్

Peddi: చికిరి చికిరి సాంగ్ వచ్చేసిందోచ్.. లిరికల్ కాదు ఏకంగా వీడియోనే.

IFFI 2025 : మలయాళ చిత్రానికి అరుదైన గౌరవం.. బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరిలో సెలెక్ట్..

Gouri G Kishan: మీ బరువెంత అని అడిగిన జర్నలిస్ట్.. అందరి ముందు మండిపడ్డ జాను హీరోయిన్

SSMB 29: హమ్మయ్య.. నేటి నుంచీ వరుస అప్డేట్స్.. ఈ రోజు స్పెషల్ పోస్టర్ తో..

Big Stories

×