E-Paper
Advertisement

ఇంటికి చుట్టాలొస్తే మష్రూమ్ గలౌటీ కబాబ్ చేసి పెట్టండి.. టేస్ట్ అదిరిపోయిందని మెచ్చుకుంటారు!

ఇంటికి చుట్టాలొస్తే మష్రూమ్ గలౌటీ కబాబ్ చేసి పెట్టండి.. టేస్ట్ అదిరిపోయిందని మెచ్చుకుంటారు!
Advertisement

Mushroom Galouti Kebab: చాలామందికి కబాబ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మాంసంతో చేసే రకరకాల వంటకాలే. అయితే శాఖాహారులు కూడా అంతే అద్భుతమైన రుచిని ఆస్వాదించాలంటే మష్రూమ్ గలౌటీ కబాబ్ మంచి ఎంపిక. మష్రూమ్స్‌తో తయారయ్యే ఈ కబాబ్స్ ప్రత్యేకత వాటి మెత్తదనమే. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయేలా ఉండే ఈ కబాబ్స్‌లో మసాలాల రుచి, మష్రూమ్స్ సువాసన ప్రతి ముక్కలోనూ తెలుస్తాయి. సాధారణంగా ఇంట్లో చేసుకునే మష్రూమ్ వంటకాలకు భిన్నంగా, కాస్త కొత్త రుచిని కోరుకునే వారికి ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. పైగా తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు.

కావాల్సిన పదార్థాలు:

మష్రూమ్స్ – 200 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంప – ఒకటి, వేయించిన శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ – ఒకటి, పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, ధనియాల పొడి – ఒక టీస్పూన్, జీలకర్ర పొడి – అర టీస్పూన్, మిరియాల పొడి – పావు టీస్పూన్, కసూరీ మేథీ – ఒక టీస్పూన్, నిమ్మరసం – ఒక టీస్పూన్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నెయ్యి – తగినంత.

Advertisement

Also Read: బ్రెడ్‌తో ఇంత రుచికరమైన స్వీటా? పండగల స్పెషల్ ‘షాహీ టుక్డా’ను మీరు ట్రై చేసేయండి!

తయారీ విధానం ఇలా:

మష్రూమ్స్‌ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరగాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి మష్రూమ్స్‌ను వేసి వాటిలోని తేమ పూర్తిగా ఆవిరయ్యే వరకు వేయించాలి. తర్వాత చల్లారనివ్వాలి. వీటిని ఉడికించిన బంగాళాదుంపతో కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని శనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కసూరీ మేథీ, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి కబాబ్ ఆకారంలో ఒత్తుకోవాలి.

ఇప్పుడు పెనంపై నెయ్యి వేసి కబాబ్స్‌ను రెండు వైపులా తక్కువ మంటపై బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే.. ఎంతో మెత్తగా, రుచిగా ఉండే మష్రూమ్ గలౌటీ కబాబ్స్ సిద్ధం. వీటిని పుదీనా చట్నీతో కలిపి వడ్డిస్తే రుచి మరింత బాగుంటుంది.

Also Read: చికెన్ కంటే పవర్‌ఫుల్.. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే 5 సూపర్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!

Tags

Related News

బ్రెడ్‌తో ఇంత రుచికరమైన స్వీటా? పండగల స్పెషల్ ‘షాహీ టుక్డా’ను మీరు ట్రై చేసేయండి!

చికెన్ కంటే పవర్‌ఫుల్.. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే 5 సూపర్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!

నోరూరించే పచ్చి రొయ్యల బెండకాయ పులుసు..క్షణాల్లో రెడీ అవుతుంది!

నోరూరించే వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఇలా చేస్తే రుచి అదుర్స్!

వీకెండ్ స్పెషల్..రుచికరమైన చికెన్ పులావ్ చేసేయండిలా!

దీపావళి రోజున కొబ్బరికాయతో ఈ చిన్న పని చేస్తే.. మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది!

దీపావళి చరిత్ర ఏమిటి? మన దేశంలో ఈ పండుగకు ఇన్ని కథలు ఎలా వచ్చాయి?

Big Stories

Advertisement
×