Shahi Tukda Recipe: స్వీట్స్ అంటే ఇష్టపడేవారికి ‘షాహీ టుక్డా’ పేరు చెబితేనే నోరూరిపోతుంది. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ సంప్రదాయ స్వీట్ రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. బంగారు రంగులో వేయించిన బ్రెడ్ ముక్కలపై చిక్కటి రబ్డీ పోసి, బాదం, పిస్తా పలుకులతో అలంకరిస్తే వచ్చే అందం, రుచి రెండూ ప్రత్యేకమే. ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ డెజర్ట్‌ను ఖరీదైన పదార్థాలేవీ లేకుండా మన ఇంట్లో ఉండే బ్రెడ్తోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పండుగల వేళ అతిథులకు కొత్త స్వీట్‌తో సర్ప్రైజ్ ఇవ్వాలన్నా, ఇంట్లోనే ఏదైనా స్పెషల్ డెజర్ట్ చేసుకోవాలన్నా షాహీ టుక్డా మంచి ఎంపిక. మరి ఈ రుచికరమైన స్వీట్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా..
బ్రెడ్ స్లైసులు – 6
పాలు – అర లీటరు
పంచదార – అర కప్పు
నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు
కండెన్స్డ్ మిల్క్ – 3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – అర టీ స్పూన్
Also Read: చికెన్ కంటే పవర్ఫుల్.. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే 5 సూపర్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!
కుంకుమపువ్వు – కొన్ని రేకులు
బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్లు
పిస్తా పలుకులు – 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు – పావు కప్పు
మొదట బ్రెడ్ స్లైసుల అంచులను తీసేసి, ఒక్కో స్లైస్‌ను త్రిభుజాకారంలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో బ్రెడ్ ముక్కలను వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక గిన్నెలో పాలు పోసి మధ్యస్థ మంటపై మరిగించాలి. పాలు సగానికి తగ్గి చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉంచాలి. ఇందులో కండెన్స్డ్ మిల్క్, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. ఇలా తయారైన చిక్కటి పాల మిశ్రమాన్నే రబ్డీ అంటారు.
మరో చిన్న గిన్నెలో పంచదార, నీళ్లు వేసి మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగి కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వేయించిన బ్రెడ్ ముక్కలను ఈ పంచదార పాకంలో ముంచి వెంటనే తీసేయాలి.
ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ ముక్కలను అమర్చి వాటిపై ముందుగా తయారు చేసుకున్న రబ్డీని పోయాలి. చివరగా బాదం, పిస్తా పలుకులతో అలంకరించాలి. అంతే ఎంతో రుచికరమైన షాహీ టుక్డా సిద్ధం. చల్లగా చేసినా, కొద్దిగా వెచ్చగా తిన్నా ఈ స్వీట్ అద్భుతంగా ఉంటుంది.
Also Read: చికెన్ కీమా పరోటా ఇలా చేసుకుని తిన్నారంటే.. టేస్ట్ వేరే లెవెల్ అంతే!