E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 తొమ్మిదో వారం నో ఎలిమినేషన్.. సేఫ్ జోన్ లో టాప్ కంటెస్టెంట్

బిగ్ బాస్ 10 తొమ్మిదో వారం నో ఎలిమినేషన్.. సేఫ్ జోన్ లో టాప్ కంటెస్టెంట్
Advertisement

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు కార్యక్రమం విజయవంతంగా 8 వారాలను పూర్తి చేస్తుంది. ఇక తొమ్మిద వారం కూడా పూర్తి కావొచ్చింది. ఎనిమిదవ వారంలో భాగంగా హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఝాన్సీ, రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తొమ్మిదవ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు అనే విషయంపై అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం 9వ వారం ఎలిమినేషన్ లేదని తెలుస్తోంది.

నామినేషన్లో 10 మంది కంటెస్టెంట్స్..

ఇక తొమ్మిదవ వారం నామినేషన్స్ లో భాగంగా రాం ప్రసాద్, వంశీ, ముకేష్ గౌడ, , సుధీర్ , వర్షిని, దేబ్జానీ, శివ కుమార్, నరేష్, అమన్, నీతూ ఈ పది మంది ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈవారం నామినేషన్స్ లో ఉన్న ముఖేష్ ఓటింగ్ పరంగా టాప్ లో ఉన్నారు. అయితే త్రిగుణ్ నామినేషన్ లో లేకపోవడంతో ఈయన ఓట్స్ అన్ని వంశీకి పడటంతో వంశీ కూడా సేఫ్ అయ్యారు. రాంప్రసాద్ నరేష్ కంటే కూడా ఓటింగ్ పరంగా వీక్ ఉన్న కంటెస్టెంట్ లో ఉండటం వల్ల వీరిద్దరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక మిగిలిన నీతూ మాస్టర్, శివ్, వర్షిణి, సుధీర్ వీరు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు. సుధీర్ గత వారం హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉండగా ముఖేష్ తనని సేవ్ చేశారు. ఇక ఈ వారం కూడా ఆయన సేవ్ అయ్యారని తెలుస్తోంది.

దివాలి స్పెషల్ ..నో ఎలిమినేషన్..

Advertisement

ఇక మిగిలిన ముగ్గురిలో శివకుమార్, నీతూ,వర్షిణి పూర్తిగా డేంజర్ జోన్ లో ఉన్నారు ఇక శివకుమార్ మంచి కంటెంట్ ఇస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక వర్షిని హౌస్ లో ముఖేష్ తో లవ్ ట్రాక్, త్రిగుణ్ తో గొడవలు పడుతూ మంచి కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఈవారం కూడా ఈమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఇక ఈ వారం వోటింగ్ పరంగా లిస్టులో ఉన్న వారిలో నీతూ మాస్టర్ ఒకరు. రోహిత్ ఎలిమినేట్ కావడంతో రోహిత్ ఫాన్స్ ఓట్లు ఈమెకు పడతాయని అందరూ భావించారు కానీ నీతూ మాస్టర్ కి మాత్రం ఓటింగ్ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ వారం నీతూ మాస్టర్ ఎలిమినేట్ అవుతుందని స్పష్టమవుతుంది.

డబుల్ ఎలిమినేషన్..

ఇలా టాప్ కంటెస్టెంట్ గా ఉండాల్సిన నీతూ మాస్టర్ ఓటింగ్ పరంగా లీస్టులో ఉండడంతో ఈమె ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా బిగ్ బాస్ ఈవారం దివాలి కావడంతో నో ఎలిమినేషన్ అంటూ చివరిలో కంటెస్టెంట్లకు బిగ్ రిలీఫ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే డేంజర్ జోన్ లో ఉన్న వర్షిణి, నీతూ మాస్టర్ ఇద్దరు కూడా సేఫ్ జోన్ లో ఉన్నారనే చెప్పాలి. ఇక ఈవారం ఎలిమినేషన్ లేకపోవడంతో వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుందని సమాచారం. ఇక ఫినాలేకి కేవలం ఐదు వారాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఎలాంటి వైల్డ్ కార్డ్స్ కూడా ఉండబోవని తెలుస్తుంది.

Advertisement

Also Read: సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేడుకలు షురూ… ఘనంగా పసుపు వేడుక!

Related News

పేల్చాల్సిన టైమ్ లో పేల్చకపోతే గన్ రివర్స్ అవుతుంది.. నీతూ వినమ్మా సరిగ్గా!

పాటలు కట్టి బ్రాండ్ చేయాల్సిన పనిలేదు… త్రిగుణ్ కి ఇచ్చి పడేసిన నాగార్జున

అతనో నక్క.. మగాడే కాదు.. దెబ్జానీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగ్!

ఘనంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మదా వివాహం… ఫోటోలు వైరల్!

ప్లీజ్ దీపావళికి క్రాకర్స్ పేల్చండి.. ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన బాలు!

గుండె నిండా గుడిగంటలు మనోజ్ నెల సంపాదన ఎంతో తెలుసా?

వైష్ణవి సోనీ హవా మామూలుగా లేదుగా..ఈ సాంగ్స్‌తోనే సెన్సేషన్!

Big Stories

Advertisement
×