E-Paper
Advertisement

చికెన్ కంటే పవర్‌ఫుల్.. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే 5 సూపర్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!

చికెన్ కంటే పవర్‌ఫుల్.. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే 5 సూపర్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!
Advertisement

Best Vegetarian Protein Foods: మన ఆరోగ్యం బాగుండాలంటే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయాలి. రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎంత ముఖ్యమో.. అది సులభంగా జీర్ణమవ్వడం కూడా అంతే ముఖ్యం. చాలామంది ప్రోటీన్ అనగానే వెంటనే చికెన్, గుడ్ల వైపు చూస్తుంటారు. కానీ, శాఖాహారంలో కూడా పొట్టకు ఎంతో మేలు చేసే అద్భుతమైన ప్రోటీన్ ఆహారాలు ఉన్నాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇవి ప్రోటీన్‌ను అందించడమే కాకుండా.. పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాంటి టాప్-5 వెజ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మొలకెత్తిన పెసలు

పెసలను నానబెట్టి మొలకలుగా మార్చడం వల్ల వాటిలో విటమిన్లు పెరుగుతాయి. వీటిని అరిగించుకోవడం చాలా తేలిక. వీటిలో ఉండే పీచు పదార్థం పొట్టకు ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా శనగలు, పెసలు తింటే కొందరికి గ్యాస్ వస్తుంటుంది. కానీ మొలకల వల్ల ఆ సమస్య తగ్గుతుంది. ప్రతి 100 గ్రాముల మొలకెత్తిన పెసలలో దాదాపు 7 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. వీటిని సలాడ్స్, పోహాలో వేసుకొని లేదా తాలింపు పెట్టుకుని తినొచ్చు.

టోఫు

Advertisement

సోయా పాలతో తయారుచేసే టోఫు శరీరానికి కావలసిన సంపూర్ణ ప్లాంట్ ప్రోటీన్‌ను అందిస్తుంది. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల టోఫులో దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది చాలా తేలికైన ఆహారం కాబట్టి.. పొట్టపై ఎలాంటి భారమూ పడదు. దీన్ని ఫ్రైడ్ రైస్, కూరల్లో వేసుకోవచ్చు లేదా కొద్దిగా మసాలా దట్టించి పాన్ ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు.

Also Read: త్వరత్వరగా తింటున్నారా? మీ వ్యక్తిత్వం గురించి సైకాలజీ చెప్తున్న షాకింగ్ విషయాలివే!

గ్రీక్ పెరుగు

Advertisement

సాధారణ పెరుగు కంటే గ్రీక్ పెరుగు చాలా చిక్కగా, ఎక్కువ ప్రోటీన్‌తో ఉంటుంది. 100 గ్రాముల గ్రీక్ పెరుగులో సుమారు 10 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. ఇందులో ఉండే లైవ్ కల్చర్స్ (ప్రాబయోటిక్స్) పొట్టలోని మంచి బ్యాక్టీరియాను కాపాడతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. దీన్ని పండ్లు, బాదం, జీడిపప్పుతో కలిసి బౌల్‌గా తినొచ్చు లేదా కీరదోసతో రైతా చేసుకుని లంచ్ టైమ్‌లో లాగించేయొచ్చు.

లో ఫ్యాట్ పన్నీర్

పాలతో చేసే పన్నీర్ రుచిగానే కాకుండా బలమైన ప్రోటీన్ మూలం. అయితే వెన్న తీసిన పాలతో చేసే లో ఫ్యాట్ పన్నీర్ ఎంచుకుంటే క్యాలరీలు తగ్గి, ప్రోటీన్ ఎక్కువగా అందుతుంది. 100 గ్రాముల లో ఫ్యాట్ పన్నీర్‌లో ఏకంగా 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలకు బలాన్ని ఇస్తుంది. ఎయిర్ ఫ్రైయర్ టిక్కాగా, పన్నీర్ భుర్జీగా లేదా మిల్లెట్ పులావ్‌లో వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

టెంపే

మనం ఎక్కువగా వినని టెంపే అనేది సోయాబీన్స్‌ను ఫర్మెంటేషన్ (పులియబెట్టడం) చేసి తయారుచేసే ఒక వంటకం. 100 గ్రాముల టెంపేలో ఏకంగా 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఫర్మెంటేషన్ వల్ల ఇది సులభంగా జీర్ణమవ్వడమే కాకుండా పొట్ట ఆరోగ్యానికి కావాల్సిన పీచు, ప్రాబయోటిక్స్‌ను అందిస్తుంది. దీన్ని ముక్కలుగా కోసి గ్రిల్ చేసుకుని సలాడ్లలో లేదా కర్రీలలో వాడుకోవచ్చు.

Also Read: మాట్లాడేటప్పుడు కళ్లు పక్కకు తిప్పడం బలహీనత కాదా? సైకాలజీ చెప్తున్న అసలు నిజమిదే!

Tags

Related News

నోరూరించే పచ్చి రొయ్యల బెండకాయ పులుసు..క్షణాల్లో రెడీ అవుతుంది!

నోరూరించే వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఇలా చేస్తే రుచి అదుర్స్!

వీకెండ్ స్పెషల్..రుచికరమైన చికెన్ పులావ్ చేసేయండిలా!

దీపావళి రోజున కొబ్బరికాయతో ఈ చిన్న పని చేస్తే.. మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది!

దీపావళి చరిత్ర ఏమిటి? మన దేశంలో ఈ పండుగకు ఇన్ని కథలు ఎలా వచ్చాయి?

త్వరత్వరగా తింటున్నారా? మీ వ్యక్తిత్వం గురించి సైకాలజీ చెప్తున్న షాకింగ్ విషయాలివే!

తొలిసారి డేటింగ్‌కు వెళుతున్నారా? అమ్మాయిలు గమనించే విషయాలు ఇవే

Big Stories

Advertisement
×