E-Paper
Advertisement

నోరూరించే పచ్చి రొయ్యల బెండకాయ పులుసు..క్షణాల్లో రెడీ అవుతుంది!

నోరూరించే పచ్చి రొయ్యల బెండకాయ పులుసు..క్షణాల్లో రెడీ అవుతుంది!
Advertisement

Prawns bendakaya pulusu: తెలుగు వంటకాల్లో నాన్‌వెజ్ కర్రీస్‌కి, ముఖ్యంగా సీఫుడ్‌కి ఉండే క్రేజే వేరు. ఆదివారం వచ్చిందంటే.. చాలా ఇళ్లలో రొయ్యలు, చేపల కూరలు గుమగుమలాడుతుంటాయి. సాధారణంగా.. రొయ్యలతో టమాటో కూర లేదా రొయ్యల వేపుడు ఎక్కువగా చేస్తుంటాం. కానీ.. పచ్చి రొయ్యలతో పాటు లేత బెండకాయలు వేసి పులుసు పెడితే ఆ రుచి ఎప్పటికీ గుర్తుండి పోతుంది. బెండకాయల జిగురు పోయి, పులుపు, కారం పీల్చుకుని రొయ్యలతో కలిసి ఉడికినప్పుడు టేస్ట్ అద్దిరిపోతుంది. అందరూ ఇష్టపడే ఈ పచ్చి రొయ్యలు ..బెండకాయ పులుసు తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం!

కావలసిన పదార్థాలు:

పచ్చి రొయ్యలు -500 గ్రాములు

బెండకాయలు -200 గ్రాములు

Advertisement

ఉల్లిపాయలు -2

పచ్చిమిర్చి – 4 లేదా 5

Advertisement

టమాటాలు – 2

చింతపండు – నిమ్మకాయ సైజు

అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 స్పూన్

కారం – రుచికి సరిపడా

పసుపు – చిటికెడు

ధనియాల పొడి – 1.5 స్పూన్లు

గరం మసాలా- అర స్పూన్

మెంతులు,ఆవాలు, జీలకర్ర- కొద్దిగా (పోపు కోసం)

కరివేపాకు -రెండు రెమ్మలు

కొత్తిమీర – కొద్దిగా

నూనె – 4 టేబుల్ స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం:

1. ముందుగా పచ్చి రొయ్యల పొట్టలోని నరాలను తీసివేసి, ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్యాన్‌లో కొద్దిగా నూనె వేసి, తరిగిన బెండకాయ ముక్కలను వేసి కొద్దిగా జిగురు పోయే.. వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పులుసులో బెండకాయలు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అదే గిన్నెలో లేదా కుక్కర్‌లో మరో.. రెండు స్పూన్ల నూనె వేసి కాగాక.. ఆవాలు, జీలకర్ర, మెంతులు , కరివేపాకు వేసి చిటపటలానివ్వాలి. ఆ తర్వాత సన్నగా.. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగEరు రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.

Also Read: కాలీఫ్లవర్‌తో ఇలా వేపుడు చేయండి..రుచి చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

2.ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను ఆ మిశ్రమంలో వేయాలి. రొయ్యలలో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత తరిగిన టమాటో ముక్కలు వేసి, టమాటోలు మెత్తగా మగ్గే వరకు మూతపెట్టి ఉడికించాలి. టమాటో గుజ్జు బాగా ఉడికిన తర్వాత పసుపు,కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మసాలాలు బాగా పట్టిన తర్వాత ముందుగా.. వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేయాలి.ఆ వెంటనే నానబెట్టి తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోయాలి. పులుసుకు సరిపడా నీరు మరియు ఉప్పు వేసి మీడియం మంటపై గిన్నెపై మూతపెట్టి ఉడికించాలి. పులుసు దగ్గర పడే వరకు, నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చివరగా గరం మసాలా,కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.

అంతే! ఘుమఘుమలాడే వేడి వేడి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు రెడీ. ఈ పులుసును వేడి వేడి అన్నంలో.. కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే.. ఆ రుచి మాటల్లో చెప్పలేం. మరుసటి రోజుకి ఈ పులుసు మరింత టేస్టీగా ఉంటుంది.మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్‌లో  ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.

Related News

నోరూరించే వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఇలా చేస్తే రుచి అదుర్స్!

వీకెండ్ స్పెషల్..రుచికరమైన చికెన్ పులావ్ చేసేయండిలా!

దీపావళి రోజున కొబ్బరికాయతో ఈ చిన్న పని చేస్తే.. మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది!

దీపావళి చరిత్ర ఏమిటి? మన దేశంలో ఈ పండుగకు ఇన్ని కథలు ఎలా వచ్చాయి?

త్వరత్వరగా తింటున్నారా? మీ వ్యక్తిత్వం గురించి సైకాలజీ చెప్తున్న షాకింగ్ విషయాలివే!

తొలిసారి డేటింగ్‌కు వెళుతున్నారా? అమ్మాయిలు గమనించే విషయాలు ఇవే

దీపావళి విందులో అతిగా తినకుండా జాగ్రత్త.. ఈ 7 టిప్స్ పాటిస్తూ పండుగ ఆస్వాదించండి

Big Stories

Advertisement
×