BigTV English

Viral Video : పుచ్చకాయల్ని మెషీన్ లో వేసి క్రాషింగ్.. ఫైరవుతున్న నెటిజన్లు.. ఇంతకీ వాళ్లేం చేశారు ?

Viral Video : పుచ్చకాయల్ని మెషీన్ లో వేసి క్రాషింగ్.. ఫైరవుతున్న నెటిజన్లు.. ఇంతకీ వాళ్లేం చేశారు ?


Watermelons Crashing in Machine : సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని ఫన్నీ వీడియోస్, ఇంకొన్ని వికృత చేష్టలు, మరికొన్ని వివిధ రకాలుగా ఉంటాయి. అయితే తాజాగా X లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో పోస్ట్ చేసిన 10 గంటల్లోనే 10 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. అంతేనా.. దీనిపై నెటిజన్లు పెద్ద చర్చే జరుపుతున్నారు. ఇంతకీ ఏంటా వీడియో ? ఎందుకా చర్చ ? వీడియోను చూసిన నెటిజన్లు ఏమంటున్నారు ? చూద్దాం.

మనం తినే ఏ ఆహారమైనా.. అందులో వాడే పదార్థాలు కావాలంటే వాటిని పండించాల్సిందే. పంటలు వేయాలంటే విత్తనాలు తప్పనిసరి. అయితే మీరు చూస్తున్న వీడియోలో.. పుచ్చకాయల్ని ఒక మెషీన్ లో వేస్తే అది వాటన్నింటినీ చకచకా క్రాష్ చేసేస్తుంది. పుచ్చకాయల్లో జ్యూస్ ను బయటకు పంపేస్తుంది. ఇదంతా చూసిన నెటిజన్లు.. అసలు ఏం జరుగుతోంది అక్కడ ? ఎందుకు అలా పుచ్చకాయల్ని పాడు చేస్తున్నారు ? అని ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.


Also Read : కారును హెలికాప్టర్ గా మార్చిన బ్రదర్స్.. ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు..

ఇంతలో క్రిస్ గల్లాటే అనే వ్యక్తి.. బహుశా ఆ మెషీన్ నుంచి పుచ్చకాయల్లో విత్తనాలను తీస్తున్నట్లున్నారు అని కామెంట్ చేశారు. మళ్లీ కొద్దిసేపటికే.. సీడ్ లెస్ పుచ్చకాయలను సాగుచేసేందుకు సీడ్స్ తీస్తున్నారని వివరించారు. అయితే ఆయన చెప్పిన దానిపై కూడా కొందరు విమర్శలు చేశారు. సీడ్ లెస్ వాటర్ మిలాన్ కు సీడ్స్ తీయడం ఏంటి ? ఏం చెప్తున్నావు నువ్వు అంటూ ఫైరయ్యారు.

కొందరైతే.. విత్తనాలు తీయడానికి మెషీన్ ను వాడటం బాగానే ఉంది కానీ.. ఆ పుచ్చకాయల్లోని పోషకాలన్నీ వృథాగా నేలపాలవుతున్నాయి. ఆ జ్యూస్ ను అలా కింద వదిలేయకుండా ఎందులోకైనా తీస్తే.. దానిని తాగుతారు కదా. అక్కడ పనిచేసేవారికి ఆకలి తీరుతుంది కదా. ఇలా వృథాగా పోనియడం ఏం బాలేదు.. అని కామెంట్స్ పెట్టారు. ఏదైతే ఏంటి.. వాళ్లకు కావాల్సింది పంట సాగుచేసి అమ్ముకోవడం.. ఇవన్నీ ఆలోచించరని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియోని ఇప్పటి వరకూ 12 మిలియన్ మందికి పైగా వీక్షించారు.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×