BigTV English

Diabetes: మీ శరీరంలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా? అయితే, డయాబెటిస్ కావచ్చు, వెంటనే…

Diabetes: మీ శరీరంలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా? అయితే, డయాబెటిస్ కావచ్చు, వెంటనే…

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య డయాబెటిస్. ఇది వచ్చిందంటే ప్రశాంతంగా జీవించడం కష్టతరంగా మారిపోతుంది. ఉప్పు, పంచదార, మైదాపిండి వంటి వాటితో చేసిన ఆహారాలను పూర్తిగా మానేయాలి. బరువు కూడా పెరిగిపోతారు. అందుకే డయాబెటిస్ రాకముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మన దేశంలో డయాబెటిస్ కేసులు పెరిగిపోతూ వస్తున్నాయి. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం అది వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. డయాబెటిస్ వచ్చిన తర్వాత కూడా ఎంతోమందికి ఆ విషయం తెలియదు.


డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు తెలియక ఆ వ్యాధి ముదిరిపోయేదాకా అలా వదిలేస్తారు. చాలామంది అందుకే డయాబెటిస్ వచ్చాక మీ శరీరంలో కొన్ని రకాల మార్పులు కనిపిస్తే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీకు మూత్ర విసర్జన వస్తూ ఉంటే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే మూత్ర విసర్జన చేశాక విపరీతమైన దాహం వేస్తున్న కూడా అది డయాబెటిస్ లక్షణం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా అయిపోతే తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. మూత్ర విసర్జన చేశాక దాహం పెరిగిపోతుంది.

కొంతమంది పనిచేసినా, చేయకపోయినా తీవ్రంగా అలసిపోతున్నట్టు కనిపిస్తారు. వారి ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. మధుమేహం వల్ల ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. వారు చిన్న పని చేసినా, చెయ్యకపోయినా కూడా అలసిపోయినట్టు అవుతారు. ఇది కూడా మధుమేహానికి ప్రారంభ సంకేతమే.


అస్పష్టమైన దృష్టి అంటే కళ్ళు మసకబారుతున్నట్టు అప్పుడప్పుడు అనిపించడం కూడా మధుమేహం వల్లేనని అర్థం చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు అతి వేగంగా పెరిగినప్పుడే ఇలా జరుగుతుంది. కళ్ళల్లో నల్ల మచ్చలు కనిపించడం కొన్నిసార్లు దృష్టి కోల్పోవడం వంటివి కూడా మధుమేహం వల్లే జరుగుతాయి.

ఇలాంటి పనులు చేసినా చేయకపోయినా బరువు అమాంతం తగ్గిపోతే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. బరువు ఆకస్మాత్తుగా తగ్గడం అనేది కూడా డయాబెటిస్ లక్షణమే. కాబట్టి మీ బరువు మీరు ప్రయత్నించకుండానే తగ్గుతూ ఉంటే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మధుమేహం వచ్చిన వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే తరచుగా అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. మీకు కూడా ఇలా జరిగితే డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాల్సిందే.

రక్తంలో చక్కర స్థాయిలు పెరిగినప్పుడు నరాలు దెబ్బ తినే అవకాశం ఉంది. అప్పుడు చేతులు, కాళ్లు, నొప్పి పెట్టడం తిమ్మిరి పెట్టడం జలదరింపులు రావడం వంటివి జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు తేలిగ్గా తీసుకోకండి.

Also Read: చలికాలంలో ఉసిరి తింటే.. ఆశ్చర్యకర ప్రయోజనాలు

డయాబెటిస్ ఉన్న వారిలో మెడ, నడుము, చంకల దగ్గర ఉన్న చర్మం నల్లగా మారిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వలన ఇలా జరుగుతుంది. కాబట్టి మెడ చుట్టూ రంగు మారినా, చిన్న మొటిమల్లాగా వచ్చినా ఇన్సులిన్ నిరోధకత అధికంగా ఉన్నట్టు గుర్తించండి. వెంటనే వైద్యం కలిసి తగిన చికిత్స తీసుకోండి.

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×