BigTV English

Curd Vs Buttermilk: వేసవిలో పెరుగు తినడం మంచిదా? లేక మజ్జిగ తాగడం ఆరోగ్యకరమా?

Curd Vs Buttermilk: వేసవిలో పెరుగు తినడం మంచిదా? లేక మజ్జిగ తాగడం ఆరోగ్యకరమా?

సీజన్‌ను బట్టి ఆహారాన్ని తీసుకోవాలి. వేసవిలో ఎంతోమంది పెరుగు లేదా మజ్జిగ తినేందుకు ఇష్టపడతారు. అయితే పెరుగు, మజ్జిగ… ఈ రెండింటిలో ఏది తినడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుందో వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. పెరుగు, మజ్జిగ ఈ రెండింటిలో కూడా ప్రోబయోటిక్ అధికంగా ఉంటాయి. అంటే ఇవి మంచి బ్యాక్టీరియాకు మద్దతునిస్తాయి. జీర్ణ క్రియను కాపాడుతాయి. పెరుగు కాస్త మందంగా క్రీములాగా ఉంటుంది. కాబట్టి అది పేగులకు, పేగుల్లోని సూక్ష్మజీవులకు మేలు చేస్తుంది. ఇక మజ్జిగ తేలికగా ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. శరీరానికి హైడ్రేటింగ్ అంటే తేమను అందిస్తుంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు.


పెరుగు తింటే ఎంత ఆరోగ్యం
పెరుగును ప్రోబయోటిక్ పవర్ హౌస్‌గా చెప్పుకుంటారు. దీనిలో లాక్టోబాసిల్లర్స్ జాతికి చెందిన బ్యాక్టీరియాలు ఉంటాయి. పాలను పులియబెట్టినప్పుడు ఈ బ్యాక్టీరియాలు ఏర్పడతాయి. ఇవి పొట్టలోని బ్యాక్టీరియాను సమతల్యం చేయడానికి జీర్ణక్రియను, మెరుగుపరచడానికి, పొట్టలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి పొట్ట మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పేగు సమస్యలు కూడా రావు. పొట్ట ఉబ్బరం వంటివి కూడా రాకుండా పెరుగు అడ్డుకుంటుంది. ఎముకుల ఆరోగ్యానికి కండరాల ఆరోగ్యానికి కావలసిన ప్రోటీన్, క్యాల్షియం పెరుగులో అధికంగా ఉంటుంది. కొన్ని పరిశోధనలు ఇది పేగు బ్యాక్టీరియాని సమతుల్యం చేసి పొట్ట ఉబ్బరం రాకుండా అడ్డుకుంటుందని తెలిసాయి. అయితే అన్ని పెరుగుల్లో కూడా యాక్టివ్ ప్రోబయోటిక్స్ ఉండవు. ఇంట్లో సొంతంగా తయారు చేసుకునే పెరుగులోనే ఎక్కువ ప్రోబయోటిక్స్ ఉండే అవకాశం ఉంటుంది. బయట అమ్మే పెరుగుల్లో ప్రోబయోటిక్స్ సంఖ్య తక్కువగా ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మజ్జిగ తాగితే
పూర్వకాలం నుంచి మజ్జిగ మన ఆహారంలో భాగంగా ఉంది. పెరుగును చిలికి నీళ్లు కలపడం ద్వారా మజ్జిగను తయారు చేస్తారు. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. క్యాలరీలు కూడా తక్కువే. మజ్జిగ తాగితే పొట్టకూ తేలికగా అనిపిస్తుంది. త్వరగా జీర్ణం అవుతుంది. మజ్జిగలో జీర్ణక్రియకు సహాయపడే బయో యాక్టివ్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే శరీరానికి హైడ్రేషన్ ను అందించే లక్షణాలు కూడా ఎక్కువ. మజ్జిగలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. పేగు ఆరోగ్యానికి కూడా మద్దతునిస్తాయి. మజ్జిగ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కాబట్టి పొట్ట ఉబ్బరం సమస్య మజ్జిగ వల్ల కూడా రాదు. అలాగే డీహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది. ఎవరైతే ఎండలోంచి ఇంట్లోకి వస్తారో వారు వెంటనే గ్లాస్ మజ్జిగను తాగడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా బయటపడతారు. శరీరానికి వెంటనే నీరు అంది డిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది.


Also Read: పచ్చి ఉల్లితో ఆరోగ్యం.. కానీ, రోజుకు ఇన్నే తినాలి.. అతిగా తింటే జరిగేది ఇదే!

పెరుగు లేదా మజ్జిగలో ఏది మంచిది?
మీ శరీరం అవసరాన్ని బట్టి మీరు రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. మీకు ప్రోటీన్, ప్రోబయోటిక్ ఎక్కువ కావాలంటే పెరుగు తినండి. లేదా శరీరానికి హైడ్రేటింగ్ చేయాలనుకుంటే మజ్జిగ తాగాలి. నిజానికి పెరుగు, మజ్జిగ… ఈ రెండు కూడా ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇవి మీకు బలమైన ప్రోబయోటిక్ ప్రయోజనాలను అందిస్తాయి. ఉత్తమ పేగు ఆరోగ్యానికి కూడా పెరుగు, మజ్జిగ రెండు సహాయపడతాయి. ఈ రెండు పాల ఉత్పత్తులే. కాబట్టి మీ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పెరుగును లేదా మజ్జిగను ఎంపిక చేసుకుని తాగడం ఉత్తమం.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×