Step Mom killed her Step Son: భార్య చనిపోయిన తర్వాత.. తమ పిల్లలకు తల్లిలేని లోటు తీర్చాలని మరో పెళ్లి చేసుకున్నాడు ఆ తండ్రి. తనకు రెండో భార్యగా వచ్చిన మహిళ తన కుమారులను కళ్లలో పెట్టుకుని చూసుకుంటుందనుకున్నాడు. తల్లిగా తన ఆలనాపాలనా చూడాల్సిన ఆ మహిళ.. ఆ పిల్లలను విపరీతంగా వేధించడం మొదలుపెట్టింది. బాలుడిని గోడకేసి కొడ్డడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మరో బాలుడికి అట్లకాడతో వాతలు పెట్టడంది ఈ కర్కశ తల్లి.
వివరాల్లోకి వెళ్తే.. మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఓ మహిళ మానవత్వమే మరిచి సవతి పిల్లలపై దారుణంగా వ్యవహరించింది. మారుతల్లి కర్కశానికి ఒక బాలుడు బలవ్వగా, మరొకరు ఆసుపత్రి పాలయ్యారు. పల్నాడు జిల్లా ఎడ్ల పాడు మండలం కొండవీటి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కొండవీటి గ్రామానికి చెందిన సాగర్, లక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కవలలు పిల్లలు పుట్టగా మూడో ప్రెగ్నెన్సీలో అనారోగ్య కారణాలతో మృతి చెందింది.
Also Read: క్రెడిట్ కార్డు నుంచి రూ.లక్ష నొక్కేసిన జీయో ఫైబర్ ఉద్యోగి.. ఇదిగో ఇలా మోసం చేశాడు
ఆ తర్వాత లక్ష్మి రెండో పెళ్లి చేసుకోగా.. వారికి ఓ కుమార్తె జన్మించింది. పెళ్లైనప్పటి నుంచి కవల పిల్లల్ని వేధిస్తూ, చిత్రహింసలకు గురిచేస్తూ వస్తున్న లక్ష్మి.. ఎవరూ లేని సమయంలో ఒక బాలుడిని గోడకేసి గట్టిగా కొట్టడంతో, అక్కడికక్కడే చనిపోయాడు. మరో బాలుడికి అట్లకాడతో వాతలు పెట్టడంతో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థాలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.