BigTV English

Tooth Paste Side Effects: మీరు వాడే టూత్ పేస్ట్ ఇలాంటిదేనా.. అయితే నోటి క్యాన్సర్ బారిన పడినట్లే

Tooth Paste Side Effects: మీరు వాడే టూత్ పేస్ట్ ఇలాంటిదేనా.. అయితే నోటి క్యాన్సర్ బారిన పడినట్లే

Tooth Paste Side Effects: ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే అందరూ చేసే పని దంతాలు శుభ్రం చేసుకోవడం. టూత్ పేస్ట్‌తో దంతాలు శుభ్రం చేసుకున్నాకే మిగతా ఏ పనులు అయినా ప్రారంభిస్తారు. అయితే ప్రతీ రోజూ వాడే టూత్ పేస్ట్ కారణంగా చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఉదయం లేవగానే పళ్లు తోముకోవడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా అంతా తొలగిపోయి శుభ్రం అవుతుంది.,  ఒకప్పుడు చాలా తక్కువ రకాల టూత్ పేస్ట్‌లు దొరికేవి. కానీ ఇప్పుడు మార్కెట్లోకి అనేక రకాల టూత్ పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. కేవలం సువాసన, తాజాదనం అనే పేరుతో ఉండే టూత్ పేస్ట్‌లు ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి.


తాజాగా ఉంచుతాయనే నమ్మకంతో కొనుగోలు చేస్తే మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. తాజా పరిశోధనల్లో టూత్ పేస్ట్‌లో వాడే రసాయనాల కారణంగా నోటి క్యాన్సర్ వంటి ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అసలు ఏ రకమైన టూత్ పేస్ట్ వాడాలో కూడా తెలియని అయోమయంలో ఉంటున్నారు.

టూత్ పేస్ట్ ను కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి ఖనిజాలు, మినరల్స్ ఉపయోగించారో ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి. అంతేకాదు అందులో సోడియం లాిరల్ సల్ఫేట్ వంటి రసాయనాలు వాడిన లేబుల్స్ ఉంటే మాత్రం అస్సలు కొనుగోలు చేయవద్దు. దీనివల్ల ఇందులో ఎస్ఎల్ఎస్ ఉన్న టూత్ పేస్ట్ నోటి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


సోడియం లారిల్ సల్ఫేట్ అంటే ఏంటి ?

సోడియం లారిల్ సల్ఫేట్ అంటే ఒక ప్రధాన రసాయన సమ్మేళనం. ఇది టూత్ పేస్ట్ ను చిక్కగా ఉండేలా చేస్తుంది. అందువల్ల దీనిలో నురుగు ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దొరికే చాలా రకాల టూత్ పేస్ట్ లలో సోడియం లారిల్ సల్ఫేట్ ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఇలాంటి టూత్ పేస్ట్ లు వాడితే నోరు దుర్వాసన వచ్చేలా చేస్తాయి. మరోవైపు క్రిములను కూడా చంపడంలో దీని ప్రభావం అంత ఎక్కువగా ఉండదు. అందువల్ల టూత్ పేస్ట్ కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కొనుగోలు చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

Fruits: ఎక్కువ ఫైబర్ ఉండే ఫ్రూట్స్ ఏవో తెలుసా ?

Health Tips: డైలీ ఈ 3 కలిపి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?

Banana leaf food: డాక్టర్లు కూడా షాక్‌ అయ్యే నిజం! ఈ ఆకుపై భోజనం చేస్తే జరిగేది ఇదే!

Heart Attack: గుండెపోటు లక్షణాలను ‘గ్యాస్’ సమస్యగా పొరబడుతున్నారా ? జాగ్రత్త !

Period leave Men: కర్ణాటకలో మహిళలకు పీరియడ్ లీవ్.. మరి పురుషులకు?

Tollywood: జూబ్లీహిల్స్ లో సందడి చేసిన సింగర్ సునీత.. వాటికే అందం తెస్తూ!

Hair Fall: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు

Kidney Stones: కిడ్నీ స్టోన్స్ సమస్యా ? పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Big Stories

×