BigTV English

JC Prabhakar Reddy: న్యాయం చేయకపోతే కుటుంబ సభ్యులతో నిరసన దీక్ష: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: న్యాయం చేయకపోతే  కుటుంబ సభ్యులతో నిరసన దీక్ష: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: వైసీపీ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని తాడిపత్రి మున్సిపల్ చేర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బస్సుల కొనుగోలు విషయంలో జగన్ ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపించిందని ఆరోపించారు. పది రోజుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్పీ కార్యాలయం, డీసీపీ ఆఫీస్ ఎదుట తన కుటుంబ సభ్యుతో కలిసి నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.


జేసీ ట్రావెల్స్‌పై తప్పుడు కేసులు పెటారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ ట్రావెల్స్‌పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పది రోజుల్లో న్యాయం జరగాలని అన్నారు. తప్పు చేసిన అధికారులను వదిలేసి.. తమను దొంగల మాదిరిగా అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేశారని ఆరోపించారు.

Also Read: సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన ఖరారు


2017 ఏప్రిల్1 తర్వాత బీఎస్ 4 వాహనాలు అమ్మకూడదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని పలు రాష్ట్రాల్లో హైకోర్టులు తీర్పు ఇచ్చారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఏపీని చెడ గొట్టింది ఐఏఎస్, ఐపీఎస్ లేనని ఆరోపించారు. రవాణా శాఖ అధికారులు అంతా అవినీతి పరులే అని అన్నారు. తన బస్సులను అన్నింటినీ ట్రాన్స్ పోర్టు అధికారులు రిపేర్ చేయించి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన పరువు తీసి బయట తిరగకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

Big Stories

×