BigTV English

Skin Tan: ఎండ వల్ల స్కిన్ ట్యాన్ అయిపోయిందా..? ఈ టిప్స్ ఫాలో అయితే చర్మం నిగనిగలాడుతుంది..

Skin Tan: ఎండ వల్ల స్కిన్ ట్యాన్ అయిపోయిందా..? ఈ టిప్స్ ఫాలో అయితే చర్మం నిగనిగలాడుతుంది..

Skin Tan: ఎండలో ఎక్కువ సమయం పాటు ఉన్నప్పుడు స్కిన్ ట్యాన్ అయిపోతుంది. వేసవి కాలంలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాలు చర్మంపై పడినప్పుడు కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంది. ఈ కిరణాలు చర్మంలోని మెలనిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తాయట. దీంతో స్కిన్ కలర్ మారిపోతుంది. మెలనిన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల చర్మం పొడిబారిపోతుందని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు.


చర్మాన్ని రక్షించుకోండిలా..
ఈ UV కిరణాల వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. అందుకే వీలైనంత వరకు ఎండకు వెళ్లకపోడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. అంతేకాకుండా UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ ఉపయోగించడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.

చర్మం ట్యాన్ అవ్వకుండా కాపాడపుపకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయట. ఈ చిట్కాలను పాటించడం ద్వారా చర్మాన్ని ఎండ యొక్క హానికరమైన UV కిరణాల నుంచి కూడా రక్షణ పొందే ఛాన్స్ ఉందట. అవి ఏంటంటే..


ఎండ చాలా ఎక్కువగా ఉంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య సమయం మధ్య ఇంట్లో ఉండడమే మంచిది. ఎండలో ఎక్కువ సమయం గడిపే వారు SPF 30-50 సన్ స్క్రీన్‌ను ప్రతి 2-3 గంటలకి ఒక సారి అప్లై చేయడం మంచిది. బయట పని చేస్తు్న్నప్పుడు లైట్ కలర్ ఉన్న బట్టలు వేసుకోవడం మంచిది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచేందుకు ఎక్కువ నీళ్లు తాగాలని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు.

ట్యాన్ పోవాలంటే..
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శుభ్రం చేయడంలో క్లెన్సర్‌లు సహాయపడతాయట. కాబట్టి మైల్డ్ క్లెన్సర్‌ను ఉపయోగించి చర్మాన్ని శుభ్రపరిస్తే ట్యాన్ అయిన చర్మం తిరిగి కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

వారానికి 2-3 సార్లు మృదువైన ఎక్స్‌ఫోలియేటర్‌తో స్కిన్ స్క్రబ్ చేయడం చాలా మంచిది. ఇది చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగించి, కొత్త కణాలు వచ్చేలా చేస్తుందట.

విటమిన్-C చర్మం యొక్క ట్యాన్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఇది మెలానిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేసేందుకు కూడా హెల్ప్ చేస్తుందట. అంతేకాకుండా చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. అందుకే విటమిన్-C సీరమ్ లేదా క్రీమ్‌ను రోజు ఉదయం లేదా రాత్రి రాసుకోవడం ఉత్తమం.

ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల ట్యాన్ తొలగిపోతుందట. లెమన్ జ్యూస్‌లో ఉండే సిట్రిక్ ఆమ్లం చర్మం పై ఉన్న ట్యాన్ తగ్గించడంలో సహాయపడుతుంది. దాన్ని నేరుగా చర్మం మీద అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత కడగితే చర్మం కాంతివంతంగా మారుతుందట.

పెరుగు అనేది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్. దీన్ని చర్మం మీద అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత శుభ్రపరచండి. ఇది చర్మాన్ని మెరుగు పరిచేందుకు సహకరిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటే, ట్యాన్ పోతుందట.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×