BigTV English
Advertisement

Hyderabad Crime : వీళ్లు ఎవరో తెలుసా? కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి..

Hyderabad Crime : వీళ్లు ఎవరో తెలుసా? కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి..

Hyderabad Crime : ఈ ఫోటోలో ఉన్న ఇద్దరినీ బాగా చూడండి. ఒకటికి రెండుసార్లు చూడండి.. వీళ్ల ఫేస్‌లు బాగా గుర్తుపెట్టుకోండి. గడ్డం ఉన్నా లేకున్నా ఎలా ఉంటారో మనసులో ఊహించుకోండి. వాళ్ల ముఖచిత్రాన్ని అస్సలు మరిచిపోవద్దు. హైదరాబాద్‌లో ఎక్కడైనా కనిపిస్తే వెంటనే డయల్ 100కి కాల్ చేసి చెప్పండి. ఎందుకంటే వీళ్లను సిటీ నుంచి బహిష్కరించారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు. వీళ్లిద్దరూ నగరంలో అడుగు పెడితే అరెస్ట్ చేస్తారు. అందుకే చాటుమాటున హైదరాబాద్‌కు వచ్చి.. ఎక్కడో ఒకచోట రహస్యంగా తలదాచుకుంటే.. ఎవరికైనా కనిపిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇంతకీ ఎవరు ఈ ఇద్దరు? హైదరాబాద్‌ నుంచి ఎందుకు బహిష్కరించారు?


మెంటల్ రాజేష్.. కంత్రీ రౌడీ షీటర్

ఫోటో చూస్తేనే తెలుస్తోంది వీళ్లు కరుడుగట్టిన నేరగాళ్లు అని. నగరంలో పేరుమోసిన రౌడీ షీటర్లు. బొట్టు పెట్టుకొని, చేతిలో సిగరేట్ పట్టుకుని, గడ్డంతో ఉన్నవాడి పేరు నలపరాజు రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్. పేరుతోనే తెలిసిపోవట్లా వాడో మెంటల్ అని. పెద్ద సైకో గాడు. ఊరికే కొడుతుంటాడు. కోపం వస్తే చంపేస్తుంటాడు. కామెడీకి క్రైమ్‌లు చేస్తుంటాడు. అదో టైప్. వీడి ఏజ్ జస్ట్ 33. ఇప్పటికే వాడిపై 19 కేసులు ఉన్నాయి. ఇందులో 4 మర్డర్ కేసులు. పలు కేసుల్లో ఇతన్ని పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు పంపించినా.. వీడి నేర చరిత్ర మాత్రం ఆగట్లేదు. పోలీసులంటే భయం లేదు. కేసులు, కోర్టులు, జైలు అంటే బెదురు లేదు. అత్తారింటికి వెళ్లొచ్చినట్టు జైల్లో గడిపి వస్తుంటాడు. తిరిగొచ్చాక మళ్లీ నేరాలు షురూ. వ్యాపారులను బెదిరించి డబ్బు వసూల్ చేయడం.. సుపారీ గొడవలు.. గ్యాంగ్ వెంటేసుకుని దౌర్జన్యాలు.. అబ్బో వీడి క్రిమినల్ హిస్టరీ పెద్దగానే ఉంది. వీడిక మారడని ఫిక్స్ అయిన పోలీసులు.. రాజేష్ హైదరాబాద్‌లో ఉంటే డేంజర్ అని.. సెక్షన్ 261 సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ చేశారు.


మీర్‌పేట్ సూరి.. వాడంటే హడల్

ఆ రెండో ఫోటోలు ఉన్నవాడి పేరు సురేందర్. అలియాస్ సూరి. మీర్‌పేట్‌లో ఉంటాడు. చూట్టానికి స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో రౌడీలా ఏం కనిపించడు. కానీ, వీడు కూడా పెద్ద గూండా. ఇతనిపై రౌడీ షీట్ కూడా ఉంది. మర్డర్‌తో పాటు 21 కేసులు ఉన్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అనేక దందాలు చేస్తుంటాడు. అనేక సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినా, తీరు మార్చుకోకపోవడంతో ఈసారి ఏకంగా ఇతన్ని నగరం నుంచి వెలివేశారు రాచకొండ పోలీసులు. మళ్లీ సిటీకి తిరిగి రావొద్దని.. వస్తే లోపలేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Also Read : మగజాతి రక్షణ కోసం ఉద్యమం..

ఈ లాజిక్ మిస్ అయిందా?

వీళ్లిద్దరు కరుడగట్టిన నేరగాళ్లని పోలీసులే చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉంటే డేంజర్ అని సిటీ నుంచి పంపించేశారు. ఇంత వరకూ ఓకే కానీ.. వీళ్లు ఇప్పుడేం చేస్తారు? వేరే సిటీకి వెళతారు. అక్కడ నేరాలు షురూ చేస్తారు. అక్కడ డాన్‌లుగా మారుతారు. మరో ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య సృష్టిస్తారు. అది కరెక్టా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారో పోలీసులు. నగర బహిష్కరణ వల్ల ఇక్కడ క్రైమ్స్ తగ్గినా.. ఆ రౌడీషీటర్లు మరో ఏరియాకు వెళ్లి అక్కడ క్రైమ్ చేయరనే గ్యారెంటీ లేదుగా? ఇలాంటి చర్యల వల్ల క్రైమ్ ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది కానీ తగ్గుతుందా? పీడీ యాక్ట్ పెట్టి జైల్లో మూసేయాల్సింది పోయి సిటీ నుంచి పంపిస్తే ఎలా? వాళ్లు ఎంచక్కా కొత్త ప్లేస్‌లో కొత్త గ్యాంగ్ తయారు చేసుకుంటారు. అంతేకానీ వాళ్లు మారరు. నేరాలు చేయడం ఆపరు. కాదంటారా? పాపం పోలీసులు మాత్రం ఏం చేస్తారులే. వారు చట్టానికి లోబడే కదా పని చేయాల్సింది. చట్టం తన పని తాను చేసుకుపోవడం అంటే ఇదే కాబోలు.

Related News

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Hyderabad: యువకుడిపై నడిరోడ్డుపై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో మరో హత్యా యత్న ఘటన

Anantapur Crime: ఫ్యాన్‌కు ఉరేసుకుని బ్యాంక్ మేనేజర్ సూసైడ్.. కారణం ఏంటి..?

Big Stories

×