BigTV English

SRH: పెద్దమ్మతల్లి గెలిపించమ్మా..జూబ్లీహిల్స్ లో SRH ప్లేయర్లు !

SRH: పెద్దమ్మతల్లి గెలిపించమ్మా..జూబ్లీహిల్స్ లో SRH ప్లేయర్లు !

SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… జూబ్లీహిల్స్ ఏరియాలో ప్రత్యక్షమయ్యారు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ( Sunrisers Hyderabad players ). తాజాగా.. జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి ( Jubilee Hills Peddamma Temple) సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్లు రావడం జరిగింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన అభిషేక్ శర్మ అలాగే నితీష్ కుమార్ రెడ్డి… ఇద్దరు ప్లేయర్లు కూడా ఇవాళ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.


Also Read:  LSG Vs MI: తిలక్ రిటైర్డ్ హర్ట్.. పాండ్యా పై ట్రోలింగ్.. అసలు ఈ వివాదం ఏంటి?

ఇక పెద్దమ్మ తల్లి ఆలయానికి సన్రైజర్స్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు వచ్చిన నేపథ్యంలో… ఆలయానికి సంబంధించిన అర్చకులు అలాగే అధికారులు ప్రత్యేక స్వాగతం పలికారు. ఆలయానికి వెళ్లిన తర్వాత అందరి భక్తుల తరహాలోనే క్యూ లైన్ పాటించి… అమ్మవారిని దర్శించుకున్నారు అభిషేక్ శర్మ అలాగే నితీష్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయించుకున్నారు ఇద్దరు హైదరాబాద్ ప్లేయర్లు.


కోల్కత్తా రైడర్స్ జట్టుతో ఇటీవల హైదరాబాద్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే కోల్కత్తా నుంచి వచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ అలాగే నితీష్ కుమార్ రెడ్డి… ఇవాళ మధ్యాహ్నం పూట జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను చూసిన నేటిజన్స్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పెద్దమ్మ తల్లి… మమ్మల్ని గెలిపించమ్మా అంటూ హైదరాబాద్ ప్లేయర్లు అభిషేక్ శర్మ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు.. కోరుకున్నారని కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Also Read: Digvesh Singh Rathi: మరోసారి వివాదం… దిగ్వేశ్‌‌కు మళ్లీ ఫైన్.. ఈసారి ఏకంగా!

దారుణంగా విఫలమవుతున్న హైదరాబాద్ జట్టు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో… ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. దానికి తగ్గట్టుగానే మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపైన గ్రాండ్ విక్టరీ కొట్టింది సన్రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ… హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో కూడా పెద్దగా రాణించడం లేదు సన్రైజర్స్. వరుసగా ఓటములతో సతమతమవుతోంది. రాజస్థాన్ జట్టు పైన గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత ఆడిన 3 మ్యాచ్ లలో కూడా ఘోరంగా ఓడిపోయింది. మొదట లక్నో చేతులో ఓడిపోయిన హైదరాబాద్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో… అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక మొన్నటికి మొన్న కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు చేతులో అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఆదివారం అంటే రేపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. మరో కీలక ఫైట్ కు రంగం సిద్ధం.. చేసుకుంది. రేపటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది హైదరాబాద్.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×