E-Paper
Advertisement

No Snacks After 6pm: సాయంత్రం ఆరు గంటల తరువాత ఈ ఫుడ్స్ తినడం ప్రమాదం

No Snacks After 6pm: సాయంత్రం ఆరు గంటల తరువాత ఈ ఫుడ్స్ తినడం ప్రమాదం
Advertisement

సాయంత్ర అయిందంటే చాలామందికి ఏదైనా స్నాక్స్ తినాలనే కోరిక కలుగుతుంది. పని అలసట తర్వాత టీతో పాటు సమోసా, పకోడీ, చాట్ లాంటి స్నాక్స్ తినడం అలవాటుగా మారింది. కానీ వైద్యులు చెబుతున్న ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని ఆహారాలు తినడం వల్ల రాత్రంతా గ్యాస్, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో శరీరం నిద్రకు సిద్ధమవుతుంది. జీర్ణక్రియ వేగం కూడా తగ్గుతుంది. అప్పుడు భారమైన ఆహారం తింటే అది సులువుగా జీర్ణం కాక సమస్యలు పెరుగుతాయి. అందుకే సాయంత్రం వేళ ఏమి తినాలి, ఏమి తినకూడదు అన్న విషయంపై అవగాహన అవసరం.

వీటిని తగ్గిస్తే మంచిది
వీధి ఆహారం సాయంత్రం సమయంలో ఎక్కువగా ఆకర్షిస్తుంది. సమోసా, వడ, పకోడీ, పానీపూరి, చాట్, వడపావ్ లాంటి పదార్థాలు ఎక్కువ నూనెతో తయారవుతాయి. ఇవి కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఫలితంగా గ్యాస్ సమస్య పెరుగుతుంది. కొందరికి రాత్రి నిద్రలో కూడా కడుపు నొప్పి వస్తుంది. ఇలాంటి ఆహారాలలో ఉప్పు, మసాలా ఎక్కువగా ఉండటం వల్ల కడుపు మంట పెరుగుతుంది. తరచుగా ఇలా తింటే అజీర్ణ సమస్య అలవాటుగా మారే అవకాశం ఉంటుంది. బయట తయారయ్యే స్నాక్స్ పరిశుభ్రత కూడా సందేహాస్పదంగా ఉంటుంది.

Advertisement

తీపి పదార్థాలు వద్దు
సాయంత్రం వేళ తీపి పదార్థాలు తినడం కూడా మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. జిలేబీ, గులాబ్ జామూన్, కేకులు, బిస్కెట్లు లాంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచుతాయి. దాంతో పాటు కడుపులో గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపు బరువుగా అనిపిస్తుంది. సాఫ్ట్ డ్రింక్స్ తాగడం అలవాటు ఉన్నవారిలో గ్యాస్ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పానీయాల్లో గాలి ఎక్కువగా ఉండటం వల్ల కడుపు ఉబ్బరం పెరుగుతుంది.

వీటిని తినండి
సాయంత్రం వేళ తేలికపాటి ఆహారం తీసుకోవడం శరీరానికి మేలు చేస్తుంది. ఉడికించిన శెనగలు, మరమరాలు, పాప్ కార్న్ లాంటి స్నాక్స్ తీసుకోవచ్చు. ఇవి కడుపుకు భారంగా ఉండవు. పండ్లు తినడం కూడా మంచి ఎంపిక. ఆపిల్, బొప్పాయి లాంటి పండ్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే కూడా ఆకలి తగ్గుతుంది. గ్రీన్ టీ లాంటి పానీయాలు కడుపును ప్రశాంతంగా ఉంచుతాయి. సాయంత్రం వేళ ఎక్కువగా తినకుండా తక్కువ పరిమాణంలో తినడం అలవాటు చేసుకోవాలి.

Advertisement

సాయంత్రం ఆహారపు అలవాట్లు మార్చుకుంటే రాత్రి నిద్ర కూడా ప్రశాంతంగా ఉంటుంది. భోజనం చాలా ఆలస్యంగా చేయకపోవడం మంచిది. సాయంత్రం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కనీసం రెండు గంటల సమయం ఇవ్వాలి. తిన్న వెంటనే పడుకోకుండా కొద్దిసేపు నడవడం మంచిది. రోజంతా సరిపడా నీరు తాగడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. చిన్న చిన్న మార్పులు చేస్తే పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. సాయంత్రం తినే ఆహారంపై శ్రద్ధ పెట్టడం ఆరోగ్యకరమైన జీవనానికి మంచి ఆరంభం అవుతుంది.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×