Black Cardamom: నల్ల ఏలకులను అమోమమ్ సుబులాటం అని కూడా పిలుస్తారు. వంటకాలలో రుచిని పెంచేందుకు దీన్ని ఎక్కువగా వాడతారు. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో సహా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో నల్ల ఏలకులను చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ, శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయట. వీటి వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..
జీర్ణ ఆరోగ్యం:
నల్ల ఏలకులు జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు సహాయపడతాయట. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, అజీర్ణం నుండి ఉపశమనం పొందడంలో, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
శ్వాసకోశ ఆరోగ్యం:
శ్వాసకోశ సమస్యలను దూరం చేయడంలో కూడా నల్ల ఏలకులు హెల్ప్ చేస్తాయట. దీన్ని తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆస్తమా, దగ్గు, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలకు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
మలినాలను తొలగించడంలో:
బ్లాక్ ఏలకులు నేచురల్ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని టాక్సిన్స్‌ని సులభంగా బయటకు పంపించాలంటే నల్ల ఏలకులను మరిగించిన నీళ్లను పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది మూత్రపిండాలు, లివర్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందట. శరీరం నుండి వ్యర్థాలు, విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు:
నల్ల ఏలకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలకు చికిత్స చేయడంలో దీన్ని వాడతారట.
రక్త ప్రసరణ:
నల్ల ఏలకులు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండె జబ్బలు కూడా దూరమవుతాయట.
ALSO READ: పచ్చి ఉల్లిపాయతో ఆరోగ్యం
బరువు తగ్గించడానికి:
మసాలా సహజమైన జీవక్రియ బూస్టర్‌గా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుందట. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగించేందుకు నల్ల ఏలకులు సహాయపడతాయట.
యాంటీఆక్సిడెంట్:
నల్ల ఏలకులలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయట. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఇవి సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు సహాయం చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించేందుకు కూడా నల్ల ఏలకులు తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యాంటీ బాక్టీరియల్ గుణాలు:
నల్ల ఏలకులలో ఉండే టెర్పెనెస్, ఫ్లేవనాయిడ్స్‌కి యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయట. శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ఆపడంలో ఇవి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణసమస్యలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయట. అంతేకాకుండా అంటువ్యాధులను తగ్గించేందుకు కూడా నల్ల ఏలకులు హెల్ప్ చేస్తాయట.
నోటి దుర్వాసన:
నోటిని రిశుభ్రంగా ఉంచేందుకు కూడా నల్ల ఏలకులు సహాయపడతాయట. వీటిని తరుచుగా తీసుకుంటే నోటి దుర్వాసన తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ల సమస్యలు, కావిటీలకు కారణమయ్యే నోటి బాక్టీరియా నుంచి కూడా రక్షిస్తాయట.